జాబ్రా నుంచి రెండు సరికొత్త బ్లూటూత్ హెడ్‌సెట్‌లు!

Posted By: Prashanth

జాబ్రా నుంచి రెండు సరికొత్త బ్లూటూత్ హెడ్‌సెట్‌లు!

 

ప్రముఖ బ్లూటూత్ హెడ్‌సెట్‌ల తయారీ సంస్థ జాబ్రా రెండు సరికొత్త బ్లూటూత్ హెడ్‌సెట్‌లను ఆవిష్కరించింది. ‘జాబ్రా క్లియర్’, ‘జాబ్రా టాక్’గా డిజైన్ కాబడిన ఈ హెడ్‌సెట్‌లు బ్లూటూత్ 3.0 వర్షన్‌ను సపోర్ట్ చేస్తాయి. ధరలు.... జాబ్రా క్లియర్ (రూ.2,699), జాబ్రా టాక్ (రూ.1,899). ఈ హెడ్‌సెట్‌లను ఏకకాలంలో రెండు బ్లూటూత్ ఆధారిత డివైజ్‌లకు జత చేసుకోవచ్చు.

ఫీచర్లు:

ఆకర్షణీయమైన స్లిమ్ డిజైనింగ్,

తక్కువ బరువు,

రెండు కలర్ వేరియంట్స్ వైట్ ఇంకా బ్లాక్,

సౌకర్యవంతమైన ఇంకా సురక్షితమైన ఇయర్ జెల్స్,

పోర్టబుల్ కార్ చార్జర్,

క్లియిర్ సౌండ్ కోసం డీఎస్ పి వ్యవస్థను హెడ్ సెట్ లో నిక్షిప్తం చేశారు.

ఏ2డీపీ ఫీచర్,

బ్యాటరీ స్థాయి ఇంకా బ్లూటూత్ స్టేటస్‌ను సూచించే వాయిస్ గైడెన్స్,

బ్యాటరీ టాక్ టైమ్ (జాబ్రా క్లియర్: 6 గంటలు, స్టాండ్ బై టైమ్ 8 రోజులు).

డ్యాన్స్ చేసే రోబోట్!

లండన్: మ్యూజిక్‌కు అనుగుణంగా డ్యాన్స్ చేసే రోబోట్ శాస్త్రవేత్తలు సృష్టించారు. పేరు ‘షిమీ’.ఈ రోబోలో అమర్చిన చెవుల్లాంటి స్పీకర్లు మ్యూజిక్‌ను చురుగ్గా గ్రహించి, అందుకు అనుగుణంగా రోబోతో స్టెప్పులేయిస్తాయి. చూడటానికి అత్యాధునిక టైబుల్ లైట్ ఆకారంలో దర్శనమిచ్చే ఈ మర యంత్రం అయిదురకాల మోటర్లతో పనిచేస్తుంది. దీని కదలికలన్నింటిని ఈ మోటర్లే నియంత్రిస్తాయి. ఇందులో అమర్చి ఉండే మైక్రోఫోన్‌కు మనమాటలు అర్థమవుతాయి. బ్రేక్, డిస్కో, ర్యాప్, పాప్, తీన్‌మార్.. ఇలా మీరు ఏ సంగీతం వినిపించితే దానికి అనుగుణంగా షిమీ స్పందిస్తుంది. జార్జియా టెక్నాలజీ పరిశోధకులు ఈ రోబోను డిజైన్ చేశారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot