జాబ్రా సంగీత పరికరాలు.., ఇప్పుడు కొత్త తరహాలో..!!

Posted By: Staff

జాబ్రా సంగీత పరికరాలు.., ఇప్పుడు కొత్త తరహాలో..!!


‘‘ఫోటోలోని కుర్రోడి స్టైల్ అదిరింది కదండి..., మీరు అలా కనిపించాలని ఆరాటపడతున్నారా..? అయితే అదరగొట్టే బనియన్, డీప్ షార్టుతో పాటు జాబ్ స్ట్రీట్ మ్యూజిక్ ఆభరణాన్ని కొనుగోలు చేయాల్సిందే.., బంగారం ఆభరణం గురించి విన్నాం, వెండి ఆభరణాన్ని చూసాం, ఇదేంటి కొత్తగా మ్యూజిక్ ఆభరణం అనుకుంటున్నారా..? అయితే మాతో రండి...’’

గత కొన్ని సంవత్సరాలుగా మ్యూజిక్ పరికరాల తయారీలో నిలకడగా రాణిస్తూ ఉత్తమ ఫలితాల రాబడుతున్న ‘జాబ్రా’ ఓ కొత్త శకానాకి నాంది పలికింది. ‘జాబ్రా స్ట్ర్రీట్ -2’ వర్షన్లో ‘మ్యూజిక్ ఆర్నమెంట్’ను మార్కెట్లో ప్రవేశపెట్టింది. ‘డాగ్ పెండెంట్’ ఆకృతిలో డిజైన కాబడ్డ గ్యాడ్జెట్ ను మెడలో గొలుసులా వేసుకోవచ్చు. హెడ్ ఫోన్ల ఆధారితంగా జత చేసుకోవల్సి ఉంటుంది.

అత్యాధునిక బ్లూటూత్ 3.0 వ్యవస్థ ఆధారితంగా పని చేసే ఈ ‘ఆడియో పరికరాన్ని’ స్మార్ట్ ఫోన్ తో పాటు ఇతర బ్లూటూత్ పరికరాలకు జత చేసుకోవచ్చు. బ్లూటూత్ సాంధ్రత 10 మీటర్లు. కొత్త తరం AM3D 2.0 సౌండ్ వ్యవస్థను పరికరంలో ఏర్పాటు చేశారు. డివైజును ఒకే సారి రెండు గ్యాడ్జెట్లకు కనెక్టు చేసుకోవచ్చు. ఏర్పాటు చేసిన 3.5mm ఆడియో జాక్, కనెక్టువిటీ వ్యవస్థను మరింత పటిష్టితం చేస్తుంది.

రిమెట్ కంట్రోల్ ఆధారితంగా గ్యాడ్జెట్ ను ఆపరేట్ చేయవచ్చు. కాల్ రిసీవింగ్, కాల్ రిజెక్టింగ్ ఫీచర్లతో పాటు మ్యూట్ అప్లికేషన్లు డివైజ్ లో ప్రత్యేక ఆకర్షణ. పటిష్ట బ్యాటరీ వ్యవస్థ 8 గంటల ‘బ్యాకప్’తో పాటు 9 రోజుల స్టాండ్ బై సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. నలుపు తెలుపు రంగుల్లో గ్యాడ్జెట్ లభ్యమవుతుంది. ‘జాబ్రా స్ట్రీట్ -2’ సంవత్సరం వారంటీతో రూ. 3,800కు మార్కెట్లో లభ్యమవుతుంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting