జాబ్రా బ్లూటూత్ మోనో హెడ్‌సెట్‌!!

Posted By: Super

జాబ్రా బ్లూటూత్ మోనో హెడ్‌సెట్‌!!

100 కిలో మీటర్ల స్పీడ్‌లో మీరు దూసుకుపోతున్నప్పటికి అంతరాయం లేని క్లియర్ వాయిస్ మీ చెవులను తడుతుంది.. దుమ్ము రేపే సుడిగాలిలో మీరు చిక్కుకున్నప్పటికి అవతలి సౌండ్ మీకు స్ఫష్టంగా వినబడుతుంది.

హెడ్‌సెట్ల తయారీలో విశ్వసనీయ బ్రాండుగా గుర్తింపు తెచ్చుకున్న ‘జాబ్రా’ బ్లూటూత్ టెక్నాలజీని మొబైల్ వాడకందారులకు మరింత చేరువుచేసంది. వైర్ల ద్వారా అనుసంధాన వ్యవస్థకు స్వస్థి పలుకుతూ ‘జాబ్రా’ ప్రవేశపెట్టిన ప్రతి వైర్‌లెస్ గ్యాడ్జెట్‌కు వినియోగదారుల నుంచి మిశ్రమ స్పందన లభిస్తుంది.

తాజాగా ఈ ఫైర్ బ్రాండ్ విడుదల చేసిన ‘జాబ్రా సుప్రీమ్’ మొట్టమొదటి బ్లూటూత్ మోనో హెడ్‌సెట్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ‘యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ’ గ్యాడ్జెట్లో ప్రధానాకర్షణ. ప్రయాణ సందర్భాల్లో కొన్ని సార్లు అవతలి వ్యక్తి నుంచి వచ్చని ఫోన్ కాల్‌కు మీరు స్పందించలేకపోతారు.

సరికొత్త ‘జాబ్రా సుప్రీమ్’ హెడ్‌సెట్ ద్వారా మీకా బెడద తప్పినట్లే. సుప్రీమ్‌లో ఏర్పాటు చేసిన ‘యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ’, ‘నాయిస్ బ్లాక్ అవుట్ 3.0’,‘విండ్ నాయిస్ రిడక్షన్’ వంటి వ్యవస్థలు ప్రయాణ సందర్భాల్లోనూ అవాంతరాలు లేని క్లియర్ కాల్‌ను మీకు చేరువచేస్తుంది.

హెడ్‌సెట్ బరువు కేవలం 18 గ్రాములు. బ్లూటూత్ వర్షన్ 3.0, ఏర్పాటు చేసిన పటిష్ట బ్యాటరీ వ్యవస్థ 6 గంటల బ్యాకప్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. వాల్యూమ్‌ను పెంచుకునేందుకు పలు ఆప్షన్లను హెడ్‌సెట్లో ఏర్పాటు చేశారు. భారతీయ మార్కెట్లో త్వరలో విడుదల కాబోతున్న ‘జాబ్రా సుప్రీమ్’ రూ. 9,000/ ఉంటుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot