జాబోన్ బ్లూటూత్ హెడ్‌సెట్!!

Posted By: Staff

జాబోన్ బ్లూటూత్ హెడ్‌సెట్!!

 

బ్లూటూత్ ఆధారిత హెడ్‌సెట్లకు పాపులారిటీ పెరుగుతున్న రోజులివి. వైర్ల రహితంగా పనిచేసే ఈ గ్యాడ్జెట్లు సౌకర్యవంతమైన హ్యాండ్ ఫ్రీ కాలింగ్‌కు దోహదపడుతున్నాయి. అదేవిధంగా రేడియేషన్ తగ్గించటంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఇటీవల మార్కెట్లో విడుదలైన ‘జాబోన్ ఐకాన్’ బ్టూటూత్ హెడ్‌సెట్స్ అమ్మకాలు గణనీయంగా పెరిగినట్లు విశ్లేషక వర్గాలు ఉటంకించాయి. డాంగిల్ స్టైల్‌లో డిజైన్ కాబడిన ఈ బ్లూటూత్ హెడ్‌సెట్ ఫీచర్లను క్లుప్తంగా పరిశీలిద్దాం:

- ఆకర్షణీయమైన రీతిలో జాబోన్ హెడ్‌సెట్ అదేవిధంగా ‘నెర్డ్’ బ్లూటూత్ డాంగిల్‌‌ను డిజైన్ చేశారు,

- విడి భాగమైన నెర్డ్ యూఎస్బీ ‘డాంగిల్ ’ను కంప్యూటర్, ల్యాప్‌టాప్ ఇతర స్మార్ట్ ఫోన్లకు కనెక్టు చేసుకోవచ్చు,

- కనెక్ట్ చేసుకున్న యూఎస్బీ డాంగిల్ డ్రైవ్ ఆధారితంగా కంటెంట్ బ్లూటూత్ సిగ్నల్స్ ద్వారా ఇయర్ డాంగిల్‌కు చేరుతుంది,

- నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ ‘NoiseAssasin 2.5’ను ఈ హెడ్‌సెట్‌లో నిక్షిప్తం చేశారు, ఈ టెక్నాలజి అంతరాయంలేని ఆడియోను శ్రోతకు చేరవేస్తుంది,

- ప్రయాణ సందర్భాల్లో అదే విధంగా రద్దీ వాతావరణంలో ‘errors’లేని కాల్‌ను మీరు పిక్ చేసుకోవచ్చు,

- కటింగ్ ఎడ్జ్ టెక్నాలజితో రూపొందించిన వాయిస్ యాక్టివిటీ సెన్సార్లను గ్యాడ్జెట్లో పొందుపరిచారు.

- అత్యాధునిక బ్లూటూత్ వ్యవస్థ వేగవంతంగా స్పందిస్తుంది,

- ఈ హెడ్‌సెట్ల ఎంపికతో వినియోగదారుడు నిశ్చింతైన అనూభూతికి లోనవుతాడు,

- ధర రూ.5,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot