సుఖమయమైన అనుభూతి!

Posted By: Prashanth

సుఖమయమైన అనుభూతి!

 

ప్రముఖ మ్యూజిక్ పరికరాల తయారీ సంస్థ జేబర్డ్, స్పోర్ట్ బ్యాండ్ ఆకృతిలో ట్రెండీ హెడ్‌ఫోన్‌ను డిజైన్ చేసింది. స్లీక్ ఇంకా మోడ్రన్ లుక్‌లో రూపుదిద్దకున్న ఈ సౌండ్ గ్యాడ్జెట్ ఆడియోను క్రిస్టల్ క్లియర్ శ్రేణిలో అందిస్తుంది. తలకు సౌకర్యవంతంగా ఇమిడే విధంగా ఈ డివైజ్ ఉంటుంది. బ్లూటూత్ ఆధారితంగా ఈ పరికరం స్పందిస్తుంది. వాల్యుమ్ కంట్రోల్, ట్రాక్ కంట్రోల్, ఆన్, ఆఫ్, పాస్, ప్లే వంటి ఆప్షన్‌లకు సంబంధించిన బటన్లను హెడ్‌సెట్ కుడి, ఎడమ భాగాల్లో అమర్చారు.

జేబర్డ్ స్పోర్ట్స్ బ్యాండ్ హెడ్‌ఫోన్ కీలక ఫీచర్లు:

ఫ్లెక్సిబుల్ ఓవర్ హెడ్‌ బ్యాండ్,

ఛార్జింగ్ పాయింట్,

తేమ నిరోధక బటన్ కంట్రోల్స్,

ఆల్యూమినియమ్ సైజ్ ఎడ్జస్టర్స్,

250ఎమ్ఏహెచ్ లితియమ్ ఐయాన్ బ్యాటరీ,

మ్యూజిక్ ప్లేబ్యాక్ టైమ్ 8 గంటలు,

టాక్ టైమ్ 11 గంటలు,

స్టాండ్ బై టైమ్ 250 గంటలు,

బ్లూటూత్ కనెక్టువిటీ,

హెడ్‌ఫోన్ బరువు 106గ్రాములు,

ఫ్రీక్వెన్సీ 2.4గిగాహెడ్జ్,

బ్యాండ్ విడ్త్ 20-20000Hz,

ఛార్జింగ్ సమయం రెండున్నర గంటలు.

బ్లూటూత్ ఆధారితంగా స్పందిచే ఈ హెడ్‌ఫోన్‌ను మొబైలింగ్ అవసరాలకు సమృద్ధిగా ఉపయోగించుకోవచ్చు. క్వారిటీతో కూడిన సంగీతాన్ని ఆస్వాదించవచ్చు. హెడ్‌ఫోన్‌ను ఒకే సారి రెండు డివైజ్‌లకు జత చేసుకోవచ్చు. ఇయర్ ప్యాడ్స్ చెవులకు సౌకర్యవంతంగా ఫిట్ అవుతాయి. రెడ్, వైట్ ఇంకా బ్లాక్ కలర్ వేరియంట్ లలో ఈ సౌండ్ డివైజ్ లభ్యం కానుంది. ధర అంచనా రూ.5,000.

ఐహోమ్ iW2 ఎయిర్‌ప్లే స్పీకర్:

ఆపిల్ డివైజ్‌లకు ఆడియో పరికరాలను సమకూర్చే ఐహోమ్ సంస్థ తాజాగా iW2 మెడల్‌లో కొత్త ఎయిర్‌ప్లే స్పీకర్లను డిజైన్ చేసింది. ఏప్రిల్ నాటికి ఈ స్పీకర్లు అందుబాటులోకి రానున్నాయి. వీటి ధర అంచనా రూ.10,000. వైర్‌లెస్ వ్యవస్థను ఈ స్పీకర్ సిస్టం పొందుపరిచారు. ముఖ్య ఫీచర్లు: మ్యూజిక్ ప్లేబ్యాక్, యూనివర్సల్ ఏసీ ఆడాప్టర్, వై-ఫై, ఐఆర్ రిమోట్, SRS WOW HD ఆడియో ప్రాసెసింగ్, ఇతర ఆడియో సోర్సుల కొరకు aux-in jack, యూఎస్బీ పోర్టు, Reson8 స్పీకర్ ఛాంబర్స్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot