ఆ సౌండ్ వింటే..జాతరే?

స్టైలిష్ ఆడియో గ్యాడ్జెట్ల తయారీదారు ఏ -జేస్ ( a-Jays) ప్రత్యేకించి ఆండ్రాయిడ్ వినియోగదారుల కోసం ‘వన్‌ప్లస్ హెడ్‌ఫోన్’లను డిజైన్ చేసింది. టాప్ క్వాలిటీ సౌండ్‌ను అందించటమే లక్ష్యంగా ఈ గ్యాడ్జెట్ రూపకల్పన జరిగింది. బుల్ట్ ఇన్ మైక్రోఫోన్ అదేవిధంగా ఇన్‌లైన్ రిమోట్ వ్యవస్థలను వన్‌ప్లస్ హెడ్‌ఫోన్‌లో బలపరిచారు.
ఏ -జేస్ ఆండ్రాయిడ్ హెడ్‌ఫోన్ ముఖ్య విశేషాలు:
వీటిని ఎంపిక చేసుకున్న ఆండ్రాయిడ్ వినియోగదారుడు అత్యుత్తమ ధ్వని నాణ్యతను ఆస్వాదించగలుగుతాడు. డివైజ్‌లో నిక్షిప్తం చేసిన నాయిస్ ఐసోలేషన్ వ్యవస్థ వినాల్సిన శబ్ధాలను ఎటువంటి అవరోధాలు లేకుండా మన్నికైనా క్వాలిటీతో అందిస్తుంది. తక్కువ బరువు, చెవులకు సౌకర్యవంతంగా ఇమిడే విధంగా ఇయర్ బడ్స్ రూపకల్పన. కాల్‌ను కనెక్ట్ చేసుకునేందుకు వన్ బటన్ యాక్సిస్.
సౌండ్ వ్యవస్థను మరింత పటిష్టపరుస్తూ 8.5mm సామర్ద్యం గల శక్తివంతమైన డ్రైవర్స్‌ను హెడ్‌ఫోన్‌లలో నిక్షిప్తం చేశారు. సుపీరియర్ బాస్ వ్యవస్థ , ఉత్తమ శ్రేణి ఆడియో ఫ్రీక్వెన్సీ, ఇండియన్ మార్కెట్లో ఏ -జేస్ వన్‌ప్లస్ హెడ్‌ఫోన్ ధర రూ.2,500.


Click it and Unblock the Notifications








