‘జేబీఎల్’తో ఇక ‘బీట్’ మార్చండి!!

Posted By: Super

‘జేబీఎల్’తో ఇక ‘బీట్’ మార్చండి!!

దిగ్గజ ఆపిల్ కార్పొరేషన్ తో జతకట్టిన జేబీఎల్ ఆడియో పరికరాల తయారు నాణ్యమైన సౌండ్ గ్యాడ్జెట్లను ప్రవేశపెట్టడంలో సఫలీకృతమవుతుంది. ఆపిల్ వినియోగదారులకు అత్యుత్తమ ఆడియోను అందించే క్రమంలో ‘జేబీఎస్’ ఇన్ పుట్, అవుట్ పుట్ సౌండ్ డివైజ్ ను ప్రవేశపెట్టనుంది. ఐఫోన్, ఐపాడ్, ఐప్యాడ్ వంటి పరికరాలకు ఈ ఐవొఎస్ డాక్ సిస్టమ్ ను అనుసంధానం చేసుకోవచ్చు.

మన్నికైన డ్యూయల్ ఫోనిక్స్ ట్రాన్స్ క్యూడర్ వ్యవస్థను ఈ బీట్ డాక్ స్టేషన్ లో ప్రవేశపెట్టారు. ఈ బీట్ వ్యవస్ధ ద్వారా విడుదలయ్యే ‘సౌండ్’ సహజానుభూతికి దగ్గరగా ఉంటుంది. సిగ్నేచర్ క్వాలిటీ సౌండ్ వ్యవస్థను జేబీఎల్ లో ప్రవేశపెట్టారు. ఈ డాక్ సౌండ్ వ్యవస్థ ద్వారా ధియోటర్ సౌండ్ అనుభూతితో యాక్షన్ సినిమాలను వీక్షించవచ్చు.

జేబీఎల్ బీట్ స్పీకర్ డాక్ కు యూఎస్బీ కనెక్షన్ ఆధారింతంగా ఇతర ప్లేయర్లను జత చేసుకోవచ్చు. అక్టోబర్ లో విడుదల కాబోతున్న ఈ సౌండ్ గ్యాడ్జెట్ ధర ఇండియన్ మార్కెట్లో రూ.8,.000కు లభ్యమవుతుందని వ్యాపార వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot