‘జేబీఎస్’ సంగీతం ఇప్పడు రూ.17000కే!!

Posted By: Staff

‘జేబీఎస్’ సంగీతం ఇప్పడు రూ.17000కే!!

‘‘మీకు నచ్చిన సంగీతాన్ని టెర్రేస్ పై చల్లటి గాలిని ఆస్వాదిస్తూ వినండి. ప్రముఖ మ్యూజిక్ స్పీకర్ల తయారీదారు ‘జేబీఎల్’ అదునాతన వైర్‌లెస్ ‘ఎయిర్ ప్లే’ స్పీకర్లను కేవలం 17,000కే అందించనున్నారు. వైర్ల సాయం లేకుండా పనిచేసే ‘ఎయిర్ ప్లే’ స్పీకర్లు అత్యాధునిక ఆడ్వాన్సడ్ ఫీచర్లతో సంగీత ప్రియులను మరింత ఆకట్టుకుంటున్నాయి.’’

క్లుప్తంగా ‘జేబీఎల్’ ఎయిర్ ప్లే స్పీకర్ల ఫీచర్లు :

- ‘వై - ఫై’ వ్యవస్థ మరియు ఎయిర్ సిగ్నలింగ్ వ్యవస్ధ ఆధారింతంగా స్పీకర్టు ప్లే అవుతాయి. ఐఫోన్, ఐప్యాడ్, ఐపోడ్ టచ్ వంటి పరికరాలకు స్పీకర్లను అనుసంధానం చేసుకునే విధంగా డాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

- మ్యాక్‌బుక్, కంప్యూటర్ పరికరాల ద్వారా బ్రౌజ్ చేసుకున్న ఐట్యూన్స్ మ్యూజిక్ లైబ్రరీ సంగీతాన్ని వై-ఫై వ్యవస్థ ద్వారా ఈ స్పీకర్లలో వినవచ్చు.

- స్పీకర్ వ్యవస్థకు ఏర్పాటు చేసిన ఫ్రంట్ డిస్‌ప్లే ‘ప్లే’ అవుతున్న ఆల్బమ్ సమాచారాన్ని డిస్‌ప్లే చేస్తుంది.

- ఏర్పాటు చేసిన ఇన్‌బుల్ట్ ఎఫ్ఎమ్ రేడియో వ్యవస్థ స్పీకర్ వ్యవస్థకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. 10 ఎఫ్ఎమ్ ఛానళ్ల వరకు స్టోర్ చేసుకోవచ్చు.

- స్పీకర్లలో ఏర్పాటు చేసిన ట్రాన్స్యూడర్ ‘360’ డిగ్రీల సౌండ్ కవరేజ్ సౌలభ్యాన్ని కలిగి ఉంటుంది.

- స్పీకర్లలో పొందుపరిచిన అత్యాధునిక సౌండ్ టెక్నాలజి వ్యవస్థ నాణ్యమైన సంగీతాన్ని వినసొంపైన తీరులో శ్రోతకు అందిస్తుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot