సొంపైన మ్యూజిక్ వినేందుకు 'క్లిప్చ్' ఉందిగా..

Posted By: Prashanth

సొంపైన మ్యూజిక్ వినేందుకు 'క్లిప్చ్' ఉందిగా..

 

ప్రోఫెషనల్ ఆడియో సర్కిల్స్‌లలో ఎక్కవగా ఉపయోగించే క్లిప్చ్ హెడ్ ఫోన్స్ మార్కెట్లోకి మరో కొత్త హెడ్‌ఫోన్ సెట్‌ని విడుదల చేసింది. దీని పేరు 'క్లిప్చ్ ఇమేజి వన్ హెడ్ ఫోన్స్'. అదిరిపోయే ఆడియో, సౌండ్ క్వాలిటీని అందిస్తాయని చెబుతున్నారు. గతంలో క్లిప్చ్ కంపెనీ ఇన్-ఇయర్ ఫోన్ మోడల్స్‌ని మార్కెట్లోకి విడుదల చేసిన సంగతి తెలిసిందే. కానీ ఇప్పుడు పూర్తిగా చెవికి సంబంధించిన ఉత్పత్తులను రూపొందించే కంపెనీగా మారింది.

క్లిప్చ్ ఇటీవల విడుదల చేసిన 'క్లిప్చ్ ఇమేజి వన్ హెడ్ ఫోన్' ఫీచర్స్ పాఠకులకు క్షణ్ణంగా..

* Supra-aural design

* Comfortable

* Premium build quality

* Integrated iphone controls

* Solid audio performance

ఇమేజి వన్ హెడ్ ఫోన్ చూసేందుకు నలుపు కలర్‌లో ఉన్నాయి. మెటిరియల్ మొత్తం తోలుతో కప్పబడి క్లిప్చ్ లోగో రెండు వైపులా అమర్చడం జరిగింది. ఈ హెడ్ ఫోన్‌ని గంటలు కొద్ది వినియోగించినప్పటికీ యూజర్స్‌కి ఎటువంటి చెవి నోప్పులు లాంటివి ఉండవని అంటున్నారు. ఈ హెడ్ ఫోన్‌ని భద్రంగా దాచుకునేందుకు గాను హెడ్ ఫోన్‌తో పాటు జిప్ కవర్ లభిస్తుంది.

చిన్న చిన్న హెడ్‌ఫోన్ జాక్స్‌కి కనెక్ట్ చేసుకునేందుకు గాను క్లిప్చ్ హెడ్ ఫోన్స్‌తో పాటు ఎడాప్టర్ ఉచితంగా లభిస్తుంది. హెడ్ ఫోన్స్ నుండి వచ్చేటటువంటి మ్యూజిక్ కస్టమర్స్‌కి వినసొంపుగా ఉంటుంది. ఇండియన్ మార్కెట్లో ఈ హెడ్ ఫోన్స్ ధర సుమారుగా రూ 6.500 వరకు ఉండవచ్చునని అంచనా..

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot