క్లిప్చ్ ఆండ్రాయిడ్ హెడ్‌ఫోన్!!

Posted By: Staff

[caption id="attachment_3255" align="aligncenter" width="500" caption="Klipsch S4A Android Headphone"]

క్లిప్చ్  ఆండ్రాయిడ్  హెడ్‌ఫోన్!!
[/caption]

 

సౌండ్ గ్యాడ్జెట్ల పరిశ్రమలో ‘60’ సంవత్సరాల అపార అనుభవాన్ని సొంతం చేసుకున్న  ‘క్లిప్చ్’ (Klipsch), 1946లో ఆవిర్భావమైన క్లిప్చ్ సంస్థ మన్నికైన ఆడియో వస్తువులను వినయోగదారులకు అందించింది.

తాజాగా ఈ సంస్థ ఆండ్రాయిడ్ ఆధారిత డివైజుల కోసం  ‘క్లిప్చ్ S4A’ హెడ్‌ఫోన్ గ్యాడ్జెట్‌ను విడుదల చేసింది. నలుపు రంగులో డిజైన్ కాబడిన ఈ ఆడియో పరికరంలోని డ్రైవర్ ఫుల్ రేంజ్ ‘KG25 కాంపోనెంట్లు’. ఆండ్రాయిడ్ వినియోగదారులు ముందుగా  ‘క్లిప్చ్ కంట్రోల్ అప్లికేషన్’ను వారి వారి ఫోన్లు లేదా టాబ్లెట్ పీసీలలోకి డౌన్‌లోడ్ చేసుకోవల్సి ఉంటుంది. ఆండ్రాయిడ్ ‘2.2’ వర్షన్ గ్యాడ్జెట్లకు, క్లిప్చ్ హెడ్‌ఫోన్ మరిన్ని కస్లమైజ్ ఆప్షన్లతో ఉపయుక్తంగా నిలుస్తుంది.

క్లిప్చ్ హెడ్‌ఫోన్లు విడుదల చేసిన  హెడ్‌ఫోన్ నాణ్యమైన ఆడియో అవుట్‌ను విడుదల చేస్తుంది. 3.5mm ఆడియో జాక్ ఆధారితంగా వైర్ల ఆధారితంగా వీటిని ఫోన్లు లేదా టాబ్లెట్ పీసీలకు జత చేసుకోవల్సి ఉంటుంది. వీటి ఫ్రీక్వెన్సీ సామర్ధ్యం 10 Hz నుంచి 19 KHz వరకు,

డివైజులో నిక్షిప్తం చేసిన  ఇన్‌లైన్ రిమోట్ ఆధారితంగా  వాల్యూమ్, ఫార్మర్డ్, బ్యాక్వర్డ్ , స్కిప్పింగ్ ట్రాక్ వంటి బేసిక్ కంట్రోల్స్‌ను  నియంత్రించుకోవచ్చు. హెడ్‌ఫోన్లలో ఏర్పాటు చేసిన మైక్రో‌ఫోన్  అంతరాయంలేని కమ్యూనికేషన్‌ను మీకు అంతిమంగా అందిస్తుంది. త్వరలో భారతీయ మార్కెట్లో లభ్యంకానున్న క్లిప్చ్ S4A హెడ్‌ఫోన్ల ధర రూ.4500 ఉండోచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot