బోర్ కొట్టేసిందా..?

By Prashanth
|
Klipsch


సాధారణ ఇయర్ ఫోన్‌లతో మ్యూజిక్ విని బోర్ కొట్టేసిందా..?, కొత్తదనం కోసం పరితపిస్తున్నారా..? అయితే, మీకో శుభవార్త!. ప్రముఖ ఆడియో పరికరాలు తయారీ సంస్థ క్లిప్చ్(Klipsch) నూతన శ్రేణి ఇన్-ఇయర్ హెడ్‌ఫోన్‌లను రూపొందించింది. వీటిని త్వరలోనే క్లిప్చ్ అధికారిక వైబ్‌సైట్ ద్వారా విడుదల చేస్తారు. రెండు సిరీస్‌లలో ఈ హెడ్‌ఫోన్‌లు రూపుదిద్దుకున్నాయి. వీటిలో మొదటిదైన ఎస్4 సిరీస్ నుంచి మొత్తం మూడు వేరియంట్‌లలో హెడ్‌ఫోన్‌లు విడుదల కాబోతున్నాయి. వాటి వివరాలు.. ఎస్4 (II), ఎస్4ఐ (II), ఎస్4ఏ (II). ఈ హెడ్‌ఫోన్‌లు ఐవోఎస్ ఇంకా ఆండ్రాయిడ్ డివైజ్‌లను సపోర్ట్ చేస్తాయి. మరో సిరీస్ ఎస్7 నుంచి రూపుదిద్దుకన్న ఏకైక వేరియంట్ ఎస్7ఐ కేవలం ఐవోఎస్ ఆధారిత పరికరాలను సపోర్ట్ చేస్తుంది.

ఎస్4 (II): ఈ హెడ్‌ఫోన్‌లు బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో లభ్యంకానున్నాయి. నాయిస్ ఐసోలేషన్ వ్యవస్థను కలిగి ఉన్న ఈ హెడ్‌ఫోన్‌లు మన్నికతో కూడిన అంతరాయంలేని ఆడియోను ఉత్పత్తి చేస్తాయి. ఓవల్ ఇయర్ టిప్స్ చెవులకు సౌకర్యవంతంగా ఇముడుతాయి. నిక్షిప్తం చేసిన శక్తివంతమైన కాయిల్ డ్రైవర్లు యూజర్‌కు క్లారిటీతో కూడిన బాస్ ఎఫెక్ట్స్‌‍ను అందిస్తాయి. ధర రూ.4,000.

ఎస్4ఐ (II):

ఈ రకం హెడ్‌ఫోన్‌లు బ్లాక్ ఇంకా వైట్ కలర్ వేరియంట్‌లలో లభ్యం కానున్నాయి. ప్రత్యేకించి ఆపిల్ డివైజ్‌ల కోసం డిజైన్ చేశారు. మ్యూజిక్ ఇంకా ఫోన్ కాల్స్ ను ఏర్పాటు చేసిన త్రీ బటన్ కంట్రోల్ ద్వారా ఏకకాలంలో నియంత్రించుకోవచ్చు. క్లారిటీతో కూడిన ఆడియోను ఈ హెడ్‌ఫోన్‌లు ఉత్పత్తి చేస్తాయి. ధర రూ.5,500.

ఎస్4ఏ (II):ఈ హెడ్‌ఫోన్‌లను ప్రత్యేకింది ఆండ్రాయిడ్ ఆధారిత పరికరాల కోసం డిజైన్ చేశారు. సింగిల్ బటన్ రిమోట్ + మైక్ ఫీచర్ ఈ హెడ్‌ఫోన్ ప్రత్యేకత. గ్యాడ్జెట్‌లో నిక్షిప్తం చేసిన హై క్వాలిటీ సౌండ్ టెక్నాలజీ, క్రిస్టల్ క్లియర్ ఆడియోను విడుదల చేస్తుంది. ధర రూ.5,500.

ఎస్7ఐ:

ఈ హెడ్‌ఫోన్‌లను పూర్తి పరిధి అమెచార్ (armature) డ్రైవర్లతో రూపొందించారు. ఉత్తమ శ్రేణి బాస్ ప్రభావాలను ఈ హెడ్‌ఫోన్ ఉత్పత్తి చేస్తుంది. మ్యూజిక్ ఇంకా ఫోన్ కాల్స్‌ను ఏర్పాటు చేసిన త్రీ బటన్ కంట్రోల్ ద్వారా ఏకకాలంలో నియంత్రించుకునే సౌలభ్యతను కల్పించారు. ధర రూ.10,000.

Best Mobiles in India

ఉత్తమ ఫోన్లు

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
X