ఎల్‌జీ సరికొత్త ఎయిర్‌ప్లే డాకింగ్ స్పీకర్ ‘ఎన్‌డి8520’!

యూజర్ ఫ్రెండ్లీ కన్స్యూమర్ ఉత్పత్తుల తయారీ బ్రాండ్ ఎల్‌జి(LG) సోమవారం ఎన్‌డి8520 మోడల్‌లో సరికొత్త ఎయిర్‌ప్లే డాకింగ్ స్పీకర్‌ను దేశీయ విపణిలో ఆవిష్కరించింది. 80వాట్ల శక్తితో కూడిన 2.1 ఛానల్ ఆడియో అనుభూతులను ఈ డాకింగ్ స్పీకర్ అందిస్తుంది. ఆపిల్ డివైజ్‌లనే కాకుండే ఇతర యూఎస్బీ, ఎంపీ3, డబ్ల్యూఎమ్ఏ ఫార్మాట్‌లను ఈ స్పీకర్ సపోర్ట్ చేస్తుంది. ఎఫ్ఎమ్ రేడియో, ఆలారమ్ క్లాక్ వంటి ప్రత్యేక ఫీచర్లను ఈ డాకింగ్ స్పీకర్ ఒదిగి ఉంది. ఎల్‌జీ బ్లూటూత్ కంట్రోల్ అప్లికేషన్ ద్వారా వీటిని ఆపరేట్ చేసుకోవచ్చు. ఇండియన్ మార్కెట్లో ఈ డాకింగ్ స్పీకర్ ధర రూ.20,990.
జీబ్రానిక్స్ నుంచి సరికొత్త బ్లూటూత్ హెడ్‌సెట్స్!
కంప్యూటర్ ఉపకరణాలను ‘జీబ్రానిక్స్’ బ్రాండ్ కింద విక్రయించే టాప్ నాట్స్ ఇన్ఫోట్రానిక్స్ ( Top Notch Infotronix)..కేవలం 7 గ్రాముల బరువుతో కూడిన బ్లూటూత్ హెడ్‌సెట్‌ను అందుబాటులోకి తెచ్చింది. పేరు ‘జడ్ఈబి-బిహెచ్500’.ఈ డివైజ్ బ్లూటూత్ ఫీచర్‌ను కలిగి ఉన్న మొబైల్ ఫోన్, టాబ్లెట్, ల్యాప్‌టాప్ అలాగే మీడియా ప్లేయర్‌లను సపోర్ట్ చేస్తుంది. ఈ హెడ్‌సెట్‌ను హ్యాండ్స్ ఫ్రీమోడ్ అలాగే స్టీరియో మోడ్‌లలో ఉపయోగించుకోవచ్చు. చెవులకు సౌకర్యవంతంగా ఇముడుతుంది. హెడ్‌సెట్‌లో ఏర్పాటు చేసిన లితియమ్ ఐయాన్ బ్యాటరీ సుధీర్ఘ బ్యాకప్‌ను అందిస్తుంది. వినూత్న డిజైన్‌తో రూపొందించబడని ఈ తక్కువ బరువు డివైజ్ అత్యుత్తమ సౌండ్ క్వాలిటీని విడుదల చేస్తుందని ఇన్ఫోట్రానిక్స్ ఇండియా సంచాలకులు రాజేష్ దోషి తెలిపారు. మార్కెట్లో జీబ్రానిక్స్ ‘జడ్ఈబి-బిహెచ్500’ ధర రూ.449.


Click it and Unblock the Notifications