‘ఎల్‌జీ’ నూతన ఆవిష్కరణ ‘HX 906TX’ స్పీకర్ సిస్టమ్!

Posted By: Super

‘ఎల్‌జీ’ నూతన ఆవిష్కరణ ‘HX 906TX’ స్పీకర్ సిస్టమ్!

దిగ్గజ ఎలక్ట్రానిక్ పరికరాల తయారీదారు ‘ఎల్‌జీ’ ఆడ్వాన్సడ్ ఫీచర్లతో ఓ సరికొత్త హోమ్ థియోటర్ సిస్టమ్‌ను అందుబాటులోకి తేనుంది. ‘HX 906TX’ మోడల్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ పరికరం 9.1 సౌండ్ వ్యవస్థను కలిగి ఉంటుంది.

10 స్పీకర్లతో ముస్తాబైన సౌండ్ సిస్టమ్‌లో 4 అప్ రైట్ 3డీ స్పీకర్లు వెర్టికల్, హారిజెంటల్ పరిమాణంలో అన్ని వైపుల నుంచి థండర్ సౌండ్‌ను విడుదల చేస్తూ ప్రత్యేక అనూభూతికి లోను చేస్తుంది. ప్రత్యేక వ్యవస్థను ఇమిడి ఉన్న
అప్‌రైట్ 3డీ స్పీకర్లు వినసొంపైన సౌండ్‌ను విడుదల చేస్తూ వినేవారిని ఆధ్యంతం ఉత్కంఠతకు లోను చేస్తాయి.

సౌండ్ సిస్టమ్‌లో ఏర్పాటు చేసిన మరో ఆప్లికేషన్ ‘డిజిటల్ సిగ్నల్ కమ్యూనికేషన్ ఆల్గార్ ధెమ్’ సౌండ్ నిష్పత్తిని నాణ్యమైన పరిమాణంలో అందిస్తుంది. హోమ్ థియోటర్‌లోని ఇతర ఫీచర్లైన 3డీ బ్లూరే ప్లేబ్యాక్, 1080 పిక్సల్ సామర్ధ్యం గల 3డీ చిత్రాలను అందిస్తుంది. మెటాలిక్ సిల్వర్ రంగులో స్లిమ్‌గా రూపుదిద్దుకున్న స్పీకర్ సిస్టమ్ ఇంటికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది.

ఆండ్రాయిడ్ ఆధారిత ఫోన్లకు ఈ హోమ్ థియోటర్‌ను అనుసంథానం చేసుకోవచ్చు. స్పీకర్ సిస్టమ్‌లో ఏర్పాటు చేసిన వై - పై వ్యవస్థ ద్వారా ఫైల్ షేరింగ్ ప్రక్రియను వేగవంతంగా నిర్వహించుకోవచ్చు. టాబ్లెట్ పీసీలతో పాటు కంప్యూటర్లు, మొబైల్ ఫోన్లకు ‘HX 906TX’ వ్యవస్థను జత చేసుకోవచ్చు. భారతీయ మార్కెట్లో విడుదల కాబోతున్న ఈ అత్యాధునిక హోమ్ థియోటర్ ధర రూ.1, 20,000 ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot