ఆపిల్ గ్యాడ్జెట్ల కోసం లిబ్రాటోన్ వై-ఫై స్పీకర్లు!!

Posted By: Staff

ఆపిల్ గ్యాడ్జెట్ల కోసం లిబ్రాటోన్ వై-ఫై స్పీకర్లు!!

ఎంటర్‌టైన్‌మెంట్‌కు ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ నెలకున్న నేపధ్యంలో మ్యూజిక్ గ్యాడ్జెట్ల అమ్మకాలు అనూహ్య రీతిలో పుంజుకున్నాయి. స్మార్ట్ ఫోన్, టాబ్లెట్, ల్యాప్‌టాప్, కంప్యూటర్ పీసీలలో మ్యూజిక్ వినే సౌలభ్యతను కల్పించారు. టెక్నాలజీ పరిణితి చెందుతున్న నేపధ్యంలో ‘బ్లూటూత్ - వైఫై’ కనెక్టువిటీ వ్యవస్థలు తెరపైకి వచ్చాయి. ఈ నేపధ్యంలో ప్రముఖ మ్యూజిక్ పరికరాల తయారీదారు ‘లిబ్రాటోన్’ ఆపిల్ గ్యాడ్జెట్ల కోసం ప్రత్యేకంగా వై-ఫై ఆధారిత సౌండ్ స్పీకర్ సిస్టంలను మార్కెట్లో ప్రవేశపెట్టింది.

‘ఎయిర్ ప్లే సౌండ్’ ప్రమాణాలతో కూడిన స్పీకర్ల సిస్టంలను లిబ్రాటోన్ విడుదల చేసింది. అత్యాధునిక సౌండ్ టెక్నాలజీతో రూపుదిద్దుకున్న ఈ వైర్‌లెస్ సౌండ్ స్పీకర్లను వై-ఫై ఆధారితంగా ఐపోడ్, ఐప్యాడ్, ఐఫోన్లకు జత చేసుకవచ్చు.

లిబ్రాటోన్ లౌంజ్, లిబ్రాటోన్ లైవ్ వర్షన్లలో ఈ స్పీకర్ గ్యాడ్జెట్లును రూపొందించారు. మొదటిగా ‘లిబ్రాటోన్ లౌంజ్’ స్పీకర్ సిస్టమ్ ఫీచర్లను పరిశీలిస్తే, వెడల్పు పరిమాణంలో ఉండే ఈ డివైజ్ గది మొత్తానికి ధియోటర్ సౌండ్‌ను ప్రసరితం చేస్తుంది. వనీలా బెయిజ్, స్లేట్ గ్రే, బ్లూ బెర్రీ బ్లాక్ రుంగుల్లో లభ్యమవుతున్న ‘లిబ్రాటైన్ లౌంజ్’ స్పీకర్ వ్యవస్థ రూ.64,000కు లభ్యమవుతుంది. ప్రీమియర్ కలర్ కాంబినేషన్లు గ్రీన్, రెడ్ క్యాష్మీర్లలో లభ్యమవుతున్న వేరియంట్ ధర రూ.68,000.

‘లిబ్రాటోన్ లైవ్’ వర్షన్ స్పీకర్ సిస్టమ్ ఫీచర్లను పరిశీలిస్తే కాంపెక్ట్ సైజులో రూపుదిద్దుకున్న ఈ గ్యాడ్జెట్ ఉన్నత ప్రమాణాలతో కూడిన ఆడియోను వినసొంపైన కోణంలో అందిస్తుంది. బ్లాక్, బెయిజ్, గ్రే, మార్కెట్ గ్రీన్, రెడ్ కాష్మీర్ రంగుల్లో డిజైన్ కాబడిన స్పీకర్ల ధరలు రూ.34,000 నుంచి రూ.40,000 వరకు ఉన్నాయి. ఆపిల్ గ్యాడ్జెట్లకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉన్న నేపధ్యంలో బ్రాండ్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ స్పీకర్లు మరింత నాణ్యతతో మార్కెట్లో మంచి హిట్ కొడతాయని కంపెనీ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot