పియాటన్ ఇయర్ ఫోన్లు, ‘తక్కువ బరువు - ఫుల్ జోష్’!!!

Posted By: Super

పియాటన్ ఇయర్ ఫోన్లు, ‘తక్కువ బరువు - ఫుల్ జోష్’!!!


‘‘కిక్ లేనిదే ‘మజా’ ఏముంటుంది..? ఏ పని చేసినా ‘జోష్’ ఉండాలంటున్నారు జోరుమీదున్న నేటితరం కుర్రకారు.’’

తాజాగా మార్కెట్లో విడుదలకాబోతున్న ఓ గ్యాడ్జెట్ తాగకుండానే ‘కిక్’ ఎక్కిస్తానంటుంది. మ్యూజిక్ ప్రేమికులకు కొత్త లోకాన్ని పరిచయం చేస్తూ ప్రముఖ ఆడియో పరికరాల తయారీ సంస్ధ ‘పియాటన్’ (Phiaton) కొత్త శకానికి నాంది పలికింది.

పియాటన్ PS 20 బ్లూటూత్ స్టీరియో ఇయర్ ఫోన్లు, ఆడియో గ్యాడ్జెట్ స్టోర్లలో సందడి చేయునున్నాయి. అత్యుత్తమ సౌండ్ మరియు అత్యాధునిక బీటింగ్ (బాస్) వ్యవస్థలను ఈ స్టీరియో ఇయర్ ఫోన్లలో లోడ్ చేశారు.

బ్లూటూత్ వర్షన్ 3.0 వ్యవస్థ ఆధారితంగా ‘పియాటన్’ ఇయర్ ఫోన్లు పని చేస్తాయి. అత్యాధునిక వైర్‌లెస్ వ్యవస్థ 10 మీటర్ల సిగ్నలింగ్ సాంధ్రతను కలిగి ఉంటుంది. గ్యాడ్జెట్లో అమర్చిన మైక్రోఫోన్ ఫ్రీక్వెన్సీ సామర్ధ్యం 4000Hz.

అత్యాధునిక స్టన్నింగ్ ఫీచర్లతో రూపుదిద్దుకున్న ‘పియాటన్’ స్టీరియో ఇయర్ ఫోన్ల బరువు 16 గ్రాములు. పరికరంలో ఏర్పాటు చేసిన 3 రంగుల
LED ఇండికేటర్ వ్యవస్థ ‘హెడ్ ఫోన్ల’ పనితీరును స్పష్టం చేస్తుంది. హెడ్‌ఫోన్ కార్డ్స్ పొడవు 18 అంగుళాలు, 14.36 mm డ్రైవర్స్‌ను గ్యాడ్జెట్ నిర్మాణంలో ఉపయోగించారు. 8 డివైజులకు ఒకే సారి ఈ గ్యాడ్జెట్‌ను పెయిర్ చేసుకోవచ్చు.

150mAh లితియమ్ పాలిమర్ పటిష్ట బ్యాటరీ వ్యవస్థను పరికరంలో అమర్చారు. ఈ సౌలభ్యతతో వినియోగదారుడు 6 గంటల టాక్ టైమ్‌తో పాటు 250 గంటల స్టాండ్ బై టైమ్‌ను పొందవచ్చు.

త్వరలో భారతీయ ఆడియో మార్కెట్లలో విడుదల కానున్న పియాటన్ బ్లూటూత్ ఆధారిత ఇయర్ ఫోన్ల ధర రూ.7,500 ఉండొచ్చని వ్యాపార వర్గాలు భావిస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot