అంతరాయం లేని ప్రయాణం ‘సరికొత్త లివియో రేడియో కిట్‌’తో..!!

Posted By: Super

అంతరాయం లేని ప్రయాణం ‘సరికొత్త లివియో రేడియో కిట్‌’తో..!!


‘‘సాంకేతిక ప్రపంచంలో కొత్తదనాన్ని కోరుకుంటున్నటెక్నాలజి ప్రేమికులు మన్నికైన వస్తువులను నిరంతరం ఆదరిస్తునే ఉంటారు. ఎంటర్‌టైన్‌మెంట్ విభాగంలో చోటుచేసుకున్న విస్తృత మార్పులు పోర్టబుల్ మీడియ్ ప్లేయర్ స్థాయి నుంచి వైర్‌లెస్ మీడియా ప్లేయర్ స్థాయి వరకు పరిణితి చెందాయి. కేవలం ఇంట్లోనే కాదు మనం ప్రయాణించే వాహనాల్లో సైతం మ్యూజిక్‌ను ఎంజాయ్ చేస్తున్నాం. అయితే ఇప్పటి వరకు యూఎస్బీ (USB), సీడీ డ్రైవ్ ల (CD drives) సాయంతో పనిచేసే మీడియా ప్లేయర్లను మనం వాహనాల్లో చూసాం. ఇప్పుడిక వాటికి చెల్లు చీటి ఇవ్వచ్చు, ఎందుకంటే..? ప్రముఖ మ్యూజిక్ పరికరాల తయారీ దారు లివియో ‘కార్ ఇంటర్నెట్ రేడియ్‌తో పాటు ఇన్ బుల్ట్ మీడియా ప్లేయర్‌ను ఒకే వ్యవస్థలో పొందుపరిచి రేడియో కిట్‌‌ను’ ప్రవేశపెట్టింది. అత్యాధునిక సాంకేతికతతో లివో రూపొందించిన ఈ రేడియో కిట్ ఏ స్ధాయిలో పని చేస్తుందో క్లుప్తంగా తెలుసుకుందామా’’..

- బ్లూటూత్ వ్యవస్థ ద్వారా పనిచేసే ఈ రేడియ్ కిట్‌ను కారు ఫ్రంట్ సీటు భాగంలో అమర్చుకోవాలి.

- ఐపాడ్, ఐఫోన్, ఐటచ్, ఐఫోన్ 4లతో పాటు 3జీ వ్యవస్థను సపోర్టు చేసే పరికరాలను బ్లూటూత్ వ్యవస్థ ఆధారితంగా రేడియో కిట్‌కు అనుసంధానం చేసుకోవచ్చు. ఈ పరికరాల్లో స్టోర్ కాబడి ఉన్న మ్యూజిక్ ఫైళ్లను వినసొంపైన స్టీరియో నాణ్యతతో ఇన్ బుల్ట్ మీడియా ప్లేయర్ మీకు అందిస్తుంది.

- రేడియో కిట్‌లో ముందుగానే అనుసంధానిబడిన ఇంటర్నెట్ రేడియ్ ఆప్లికేషన్ వ్యవస్థ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 45,000 ఎఫ్ఎమ్ స్టేషన్లను మీ ముందు ప్లే చేస్తుంది.

- ఫోన్ వచ్చిన సందర్భాల్లో ఎటువంటి అంతరాయాలు లేకుండా మాట్లాడుకోవచ్చు.

- ఈ ఏడాది లాస్ వేగాస్ (Las Vegas)లో నిర్వహించిన ప్రతిష్టాత్మక ‘కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ షో 2011’ కార్యక్రమంలో లివియో రేడియో ఆప్లికేషన్, అత్యుత్తమ ఆప్లికేషన్‌గా గుర్తింపు తెచ్చుకుంది.

- ధర అంశాన్ని పరిశీలిస్తే లివియో రేడియో కిట్ ఇండియన్ మార్కెట్లో రూ. 5750కు లభ్యమవుతుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot