‘ఎయిర్ ప్లే’ స్పీకర్లతో పెన్‌డ్రైవ్‌లోని పాటలను వినొచ్చు!!

Posted By: Super

‘ఎయిర్ ప్లే’ స్పీకర్లతో పెన్‌డ్రైవ్‌లోని పాటలను వినొచ్చు!!

ఖరీదైన మ్యాజిక్ సిస్టమ్‌ను మార్కెట్లో ప్రవేశపెట్టి కొత్త ఒరవడిని సృష్టిస్తున్న ప్రముఖ స్పీకర్ల తయారీదారు ‘లోవీ’ మరో నూతన ఆవిష్కరణకు తెర లేపింది. ఈ బ్రాండ్ రూపొందించిన ప్రత్యేక ‘ఎయిర్ ప్లే’ స్పీకర్లను ఐఫోన్, ఐపాడ్, ఐప్యాడ్ వంటి పరికరాలకు వైర్‌లెస్ ఆధారితంగా లేదా డాకింగ్ విధానం ద్వారా అనుసంధానం చేసకోవచ్చు.

స్పీకర్లలో పొందుపరిచిన లాన్ (LAN), WLAN వ్యవస్థల ద్వారా ట్రాన్స్‌మిషన్ ప్రక్రియ జరుగుతుంది. ఎయిర్ ప్లే స్పీకర్లలో పొందుపరిచిని ‘యూఎస్బీ పోర్టు’ పెన్‌డ్రైవ్‌లోని మ్యూజిక్‌ ఫైళ్లను సైతం ప్లే చేస్తుంది.

మీడియా ప్లేయర్లతో పాటు వివిధ మైక్ సెట్లకు ఈ స్పీకర్లను అనుసంధానం చేసుకోవచ్చు. రెండు శక్తివంతమై సబ్ ఊఫర్లతో పాటు రెండు ట్వీటర్లు, రెండు మిడ్ రేంజ్ స్పీకర్లను ‘ఎయిర్ ప్లే’ స్పీకర్లలో లోడ్ చేశారు. అత్యాధునిక సౌండ్ టెక్నాలజి శ్రోతకు నాణ్యమైన ఆడియో అనుభూతిని కలిగిస్తుంది.

ఆల్యూమినియం బ్లాక్, ఆల్యూమినియం సిల్వర్ బాడీ పెయింటింగ్‌లతో ఈ స్పీకర్లు డిజైన్ చేయబడ్డాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఎయిర్ ప్లే స్పీకర్లు అక్టోబర్‌లో విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. వివిధ వేరియంట్లలో లభ్యమవుతున్న ఈ స్పీకర్లు ప్రారంభ ధరలు రూ.53,572 నుంచి మొదలవుతున్నట్లు తెలుస్తోంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot