‘లోవీ’ సౌండ్ సిస్టమ్‌తో ఇళ్లంతా సందడి సందడి..!!

Posted By: Super

‘లోవీ’ సౌండ్ సిస్టమ్‌తో ఇళ్లంతా సందడి సందడి..!!

టచ్‌స్ర్ర్కీన్ డిస్‌ప్లే సామర్ధ్యంతో ఓ ఆధునిక ఆడియో సిస్టమ్ రూపుదిద్దుకుంది. మీ ఐఫోన్, ఐపాడ్ మరియు సెల్ ఫోన్లకు ఈ వ్యవస్ధను వైర్ల సాయం లేకుండా జత చేసుకోవచ్చు. అత్యాధునిక ఎఫ్ఎమ్ రేడియో, ఆధునిక వర్షన్ వై-ఫై, బ్లూటూత్, ఇతర్ నెట్ వంటి ఆప్లికేషన్లను ఈ ఆడియో సిస్టమ్‌లో పొందుపరిచారు. ఆడియో సిస్టమ్‌లో భాగంగా సీడీ ప్లేయర్‌తో పాటు, 6 ఇన్‌బుల్ట్ స్పీకర్లు రెండు సబ్ ఊఫర్లను కలిగి ఉంటాయి.

ప్రముఖ మ్యూజిక్ పరికరాల తయారీదారు ‘లోవీ’ (Loewe), సౌండ్ విజన్ పేరుతో ఓ సరికొత్త ఆడియో సిస్టమ్‌ను మార్కెట్లో విడుదల చేయునుంది. ఈ ఆడియో సిస్టమ్‌లో సీడీ ప్లేయర్ ఉన్నప్పటికి, డాకింగ్ వ్యవస్థ సాయంతో ఐపాడ్, ఐ‌ఫోన్ వంటి మ్యూజిక్ గ్యాడ్జెట్లను అనుసంధానం చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్లలోని మ్యూజిక్ ఫైళ్లను బ్లూటూత్ వ్యవస్థ ఆధారితంగా ఆడియో సిస్టమ్ ద్వారా వినవచ్చు.

7.5 అంగుళాల టచ్ స్క్రీన్ డిస్‌ప్లే వ్యవస్ధ మ్యూజిక్ ఫైల్ ఆల్బమ్ కవర్‌తో పాటు సంబంధిత సమచారాన్ని డిస్‌ప్లే చేస్తుంది. టచ్‌స్ర్ర్ర్కీన్ వ్యవస్థ సౌలభ్యంతో కేవలం చేతి వేళ్లతో ఆడియో సిస్టమ్‌ను నియంత్రివచ్చు.

ఆడియో సిస్టమ్‌లో పొందుపరిచిన ప్రిసైజుడ్ సౌండ్ టెక్నాలజి నాణ్యమైన సంగీతాన్ని శ్రోతకు అందిస్తుంది. మీడియా ప్లేయర్‌లో అమర్చిన వివిధ ఈక్వలైజర్ ఆఫ్షన్లతో కోరిన రీతిలో సంగీతాన్ని వినవచ్చు.

వై- ఫై వ్యవస్థ ఆధారితంగా కోరిన ఎఫ్‌ఎమ్ స్టేషన్లను వినవచ్చు. అత్యాధునిక ఫీచర్లతో ఈ అక్టోబర్‌లో విడుదల కాబోతున్న ‘లోవీ’ సౌండ్ విజన్ సౌండ్ సిస్టమ్, భారతీయ మార్కెట్ ధర రూ.92,000 ఉండోచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot