ఎందుకో అంత మక్కువ..? అందరి చూపు ఆ వైపే!!

Posted By: Super

ఎందుకో అంత మక్కువ..? అందరి చూపు ఆ వైపే!!

 

ఆపిల్ గ్యాడ్జెట్‌లకు విడిభాగాలను సమకూర్చే కంపెనీల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతుంది. కారణం ఆపిల్‌కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న డిమాండ్. తాజాగా ఆపిల్ పరికరాల కోసం లాగిటెక్ సంస్థ పోర్టబుల్ స్పీకర్ సిస్టం‌ను డిజైన్ చేసింది. వైర్‌లెస్ వ్యవస్థ ఆధారితంగా ఎయిర్‌ప్లే టెక్నాలజీతో పనిచేసే ఈ స్పీకర్ సిస్టం వై-ఫై సౌలభ్యతతో మ్యూజిక్‌ను స్ట్ర్రీమ్ చేస్తుంది. క్లిప్చ్, జేబీఎల్ వంటి దిగ్గజ సంస్థలు ఇటీవలే ఈ తరహా స్పీకర్ డాక్‌లను అందుబాటులోకి తెచ్చాయి.

ఆకర్షణీయమైన శైలిలో లాగీటెక్ యూఈ ఎయిర్ స్పీకర్ డాక్ ఉంటుంది. వైర్ల సాయం లేకుండా ఈ డివైజ్‌ను ఐప్యాడ్, ఐఫోన్ తదితర ఆపిల్ డివైజ్‌లకు అనుసంధానం చేసుకోవచ్చు. ఈ స్పీకర్ ఉత్పత్తి చేసే సౌండ్ మన్నికైన కోణంలో శ్రోతకు అందుతుంది. పవర్, మ్యూట్ మరియు వాల్యుమ్ బటన్లను స్పీకర్ వెనుక భాగంలో ఏర్పాటు చేశారు. ముందు భాగం ఫ్యాబ్రిక్ తరహా పదార్ధంతో కప్పబడి స్పీకర్లకు రక్షణ కవచంలా నిలుస్తుంది. ఏప్రిల్‌లో మార్కెట్లోకి రానున్న లాగీటెక్ యూఈ ఎయిర్ స్పీకర్ డాక్ ధర రూ. 20,500.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot