అంతరాయంలేని వైర్‌లెస్ సంగీతం ‘బూమ్ బాక్స్’తో..!!

Posted By: Super

అంతరాయంలేని వైర్‌లెస్ సంగీతం ‘బూమ్ బాక్స్’తో..!!


‘‘టెక్ యుగానికి అద్దం పట్టే సాంకేతిక పరిజ్ఞానం విప్లవాత్మక మార్పులతో కొత్త పుంతలు తొక్కుతుంది. వైర్‌లెస్ వ్యవస్ధ ఆవిర్భావంతో సమాచార వ్యవస్థ మరింత మూరుమూల పల్లెలకు సైతం విస్తరించింది... ‘అంతా టెక్నాలజీ మాయ...’, మోడ్రన్ సాంకేతిక వ్యవస్థతో మ్యూజిక్ పరికరాల విభాగం వినూత్న ఒరవడికి శ్రీకారం చుట్టుంది. కొత్తదనాన్ని ఆస్వాదించే మ్యూజిక్ ప్రేమికులతో కోసం వైర్‌లెస్ మ్యూజిక్ స్పీకర్ సెట్లను ఇప్పటికే పలు బ్రాండ్లు మార్కెట్లో విడుదల చేశాయి. ఈ కోవలోనే ప్రముఖ మ్యూజిక్ స్పీకర్ల తయారీదారు ‘లాగిటెక్’ రెండు సరికొత్త మ్యూజిక్ పరికరాలను మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ‘లాగిటెక్ వైర్‌లెస్ బూమ్‌బాక్స్’, ‘లాగిటెక్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్’ పేర్లతో ఇప్పటికే అమెరికా, ఐరోపా దేశాల్లో విడుదలైన ఈ పరికరాలు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. భారతీయ మార్కెట్లో విడుదల కాబోతున్న ఈ వినూత్న పరికరాలు అమ్మకపు శాతాన్ని మరింత వృద్ధి చేస్తాయిని వ్యాపార వర్గాలు విశ్లేషిస్తున్నాయి.’’

క్లుప్తంగా బూమ్ బాక్స్ ఫీచర్లు:

- ఆడియో స్పీకర్లతో ఏర్పాటు చేయబడని ‘ లాగిటెక్ వైర్‌లెస్ బూమ్ బాక్స్’ను ఇతర మీడియా డివైజ్‌లకు బ్లూటూత్ ప్రక్రియ ద్వార అనుసంధానం చేసుకోవచ్చు.

- బ్లూటూత్ వ్యవస్ధ ఆధారితంగా పని చేసే బూమ్‌బాక్స్ పరికరాన్ని ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్లవచ్చు.

- టాబ్లెట్ పీసీ, స్మార్ట్ ఫోన్ వంటి పరికరాలకు బూమ్‌బాక్స్‌ను అనుంసంధానం చేసిన సందర్భంలో ఆయా గ్యాడ్జెట్లనే రిమోట్‌లా వాడుకోవచ్చు.

- బూమ్‌బాక్స్‌లో పొందుపరిచిన అత్యాధునిక బ్యాటరీ వ్యవస్థ 6 గంటల బ్యాకప్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

- వినసొంపైన సంగీతాన్ని థియోటర్ అనుభూతిలో అందించే బూమ్‌బాక్స్ సౌండ్ బాక్సుల పరికరాన్ని పార్టీలలోనే కాకుండా వివిధ శుభకార్యాలలో ఉపయోగించుకోవచ్చు.

లాగిటెక్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్ ఫీచర్లు క్లుప్తంగా:

- బ్యాటీరీ సామర్ధ్యం పై పనిచేసే ‘లాగిటెక్ వైర్‌లెస్ హెడ్‌ఫోన్’ బ్లూటూత్ వ్యవస్ధ ఆధారితంగా మధురమైన సంగీతాన్ని నాణ్యమైన పిచ్‌లో శ్రోతకు అందిస్తుంది.

- ఐప్యాడ్, ఐ ఫోన్, ఐపోడ్ వంటి పరికరాలకు ఈ హెడ్‌ఫోన్‌ను అనుసంధానం చేసుకోవచ్చు.

- కాల్స్ రిసీవ్ చేసుకునే సందర్భంలో అంతరాయాలు లేని రిసీవర్ వాయిస్‌ను మీరు వినవచ్చు.

- భారతీయ మార్కెట్లో త్వరలో విడుదల కాబోతున్న ఈ మ్యూజిక్ గ్యాడ్జెట్ల ధరలు రూ. 8,600 (బూమ్ బాక్స్), రూ. 3,350 (వైర్ లెస్ హెడ్ ఫోన్స్) ఉండవచ్చని విశ్వసనీయ వర్గాలు పేర్కొంటున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot