ప్రత్యర్థికి ‘డెరెక్ట్’ సవాల్..?

Posted By: Super

ప్రత్యర్థికి ‘డెరెక్ట్’ సవాల్..?


‘‘ప్రత్యర్థిని చిత్తు చేసేందుకు ఆ ‘సింహం’ విసిరిన పంజా గూటి దెబ్బ రుచి చూపించిందా..?’’

మ్యూజిక్ గ్యాడ్జెట్లు పుట్టుగొడుగుల్లో ఆవిర్భవిస్తున్న ప్రస్తుత ‘టెక్ ప్రపంచం’లో, సత్తాగల బ్రాండ్ ‘లాగిటెక్’ (Logitech) ప్రత్యర్ధి బ్రాండ్లకు డైరెక్ట్ సవాల్ విసురుతుంది. స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్, టాబ్లెట్ పీసీలకు జత చేసుకునే విధంగా ‘బ్లూటూత్’ ఆధారిత సరికొత్త బూమ్ బాక్స్ స్పీకర్‌ను ‘లాగిటెక్’ ప్రవేశపెట్టింది.

‘హ్యాండ్ ఫ్రీ’ ఆపరేషన్ ప్రధాన నినాదంతో లాగిటెక్ ఈ గ్యాడ్జెట్‌ను డిజైన్ చేసింది. నిక్షిప్తం చేసిన 1.5 బ్లూటూత్ HFP ప్రొఫైల్ సపోర్టు వ్యవస్థ హ్యాండ్స్ ఫ్రీ వీడియో కాలింగ్, ఛాటింగ్‌లకు ఉపయోగకరంగా నిలుస్తుంది.

బూమ్ బాక్స్‌ను ఐప్యాడ్, ఐపోడ్ టచ్, ఐఫోన్ వంటి మ్యూజిక్ ప్లేయర్లకు జత చేసుకోవచ్చు. అనివార్య కారణాల వల్ల బ్లూటూత్ పని చేయని పక్షంలో 3.5mm జాక్ ఆధారితంగా అనుసంధానం చేసుకోవచ్చు.

గ్యాడ్జెట్లో ఏర్పాటు చేసిన ‘టచ్ ప్యానల్’ వాల్యూమ్, మేక్ కాల్స్, సెలక్ట్ ట్రాక్స్ వంటి అంశాలకు దోహదపడుతుంది. యూఎస్బీ పోర్టు ఆధారితంగా ఈ బూమ్ బాక్స్ రిఛార్జ్ అవుతుంది. ఏర్పాటు చేసిన పటిష్ట బ్యాటరీ వ్యవస్థ 10 గంటల బ్యాకప్ సామర్ధ్యం కలిగి ఉంటుంది.

రూ.6,000లకు త్వరలో భారతీయ మార్కెట్లో విడుదల కాబోతున్న ‘లాగిటెక్ బ్లూటూత్ స్పీకర్’, జాబోన్ జామ్ బాక్స్ బ్లూటూత్ స్సీపర్‌కు ధీటైన సవాల్‌గా నిలువనుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot