వణికించనున్న ‘లాగిటెక్’ తుఫాన్..!!

Posted By: Super

వణికించనున్న ‘లాగిటెక్’ తుఫాన్..!!

టాబ్లెట్ పీసీల పెను విప్లవాన్ని ఎదుర్కొన్న ఇండియన్ గ్యాడ్జెట్ మార్కెట్లు తాజాగా మరో విప్లవాత్మక ఉప్పెనను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రముఖ ఆడియో పరికరాల తయారీదారు ‘లాగిటెక్’ (Logitech) టాబ్లెట్ పీసీలకు, స్పీకర్లు రూపొందించి సరికొత్త సంచలనానికి తెరలేపింది. అటు టాబ్లెట్ ప్రేమికులతో పాటు ఇటు సంగీత ప్రియులను ఆకట్టకునేందుకు ‘లాగిటెక్’ ఈ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. కేవలం రూ.2300లకే లభ్యమయ్యే ఈ సరికొత్త టాబ్లెట్ స్పీకర్లు మర్కెట్ ను ఏ మేరకు వణికిస్తాయో వేచి చూడాలి మరి..

క్లుప్తంగా లాగిటెక్ స్పీకర్ ఫీచర్లు :

- టాబ్లెట్ పీసీలో ఏర్పాటు చేసిన 3.5 mm ఆడియో జాక్ కు, టాబ్లెట్ స్పీకర్ కేబుల్ ను అనుసంధానం చేసుకోవల్సి వస్తుంది.

- టాబ్లెట్ పీసీలో పాటలు వినటంతో పాటు సినిమాలను వీక్షించే సందర్భాల్లో ఈ స్పీకర్లను అమర్చుకుని నాణ్యమైన థియోటర్ అనుభూతిని పొందవచ్చు.

- పార్టీలతో పాటు ఇతర సందర్భాల్లో హోమ్ థియోటర్ తో పని లేకుండా, ఈ టాబ్లెట్ స్పీకర్ తో సంగీతాన్ని ఎంజాయ్ చేయవచ్చు.

- కేబుల్ అనుసంధానంతో పనిచేసే ఈ స్పీకర్లకు ఛార్జింగ్ పెట్టుకోవల్సి ఉంటుంది.

- నిర్ధేశించిన స్టోర్లలో లభ్యమవుతున్న ఈ స్పీకర్ల ధరలు రూ.2300 నుంచి ప్రారంభమవుతున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot