లాగిటెక్ ‘ఐప్యాడ్’ వైర్ లెస్ స్పీకర్లు...

Posted By: Staff

లాగిటెక్ ‘ఐప్యాడ్’  వైర్ లెస్ స్పీకర్లు...

ఆపిల్ మ్యూజిక్ పరికరాల కోసం ప్రముఖ సాంకేతిక పరికరాల తయారీదారు ‘లాగీటెక్’ ప్రతిష్టాత్మకంగా రూపొందించిన ‘వైర్ లెస్ బూమ్ బాక్స్’ స్పీకర్లు ప్రస్తుత మార్కెట్లో హాట్ టాపిక్.

బ్లూటూత్ ఆధారితంగా పని చేసే ఈ స్పీకర్లను ఐప్యాడ్, ఐఫోన్ డివైజలతో పాటు బ్లూటూత్ ఆధారిత గ్యాడ్జెట్లకు జత చేసుకోవచ్చు. మునుపటి ‘లాగీటెక్ స్పీకర్లతో’ విడుదలైన నూతన స్పీకర్లలో అత్యాధునిక సౌండ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

స్పీకర్లలో పొందుపరిచిన పటిష్ట బ్యాటరీ వ్యవస్థ 6 గంటల బ్యాకప్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. కేబుల్ ఆధారితంగా వివిధ మ్యూజిక్ ప్లేయర్లను స్పీకర్లకు అనుసంధానం చేసుకునేందుకు ఆక్సిలరీ పోర్టులను ఏర్పాటు చేశారు.

కొత్త జనరేషన్ సౌండ్ వ్యవస్థతో రూపుదిద్దుకున్న ‘లాగీటెక్ బూమ్ బాక్స్ స్పీకర్లు’ అమ్మకాలు అమెరికాలో మొదలయ్యాయి. భారతీయ మార్కెట్లో త్వరలో విడుదల కాబోతున్న ఈ గ్యాడ్జెట్ ధర రూ.7,500 ఉంటుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot