బిజినెస్ ప్రజల కోసం లాగిటెక్ హెడ్‌సెట్స్!!

Posted By: Super

బిజినెస్ ప్రజల కోసం లాగిటెక్ హెడ్‌సెట్స్!!

 

ప్రముఖ కంప్యూటర్ పరికరాల తయారీదారు ‘లాగిటెక్’ (Logitech) ప్యత్యేకించి బిజినెస్ ప్రజల కోసం మ్యూజిక్ పరికరాలను రూపొందించింది. మూడు సరికొత్త హెడ్ సెట్ పరికరాలను మార్కెట్లో విడుదల చేయునుంది. వ్యాపార లావాదేవీలతో నిత్యం తనమునకలయ్యే వ్యాపార వేత్తలు కొన్ని సందర్భాలలో కాల్స్ ను అందుకోలేకపోతారు. ఇటువంటి వారి కోసం సౌకర్యవంతంగా, ఒత్తిడి లేకుండా వ్యాపార లావాదేవీలను నిర్వహించుకునేందుకు ‘లాగిటెక్’ సంస్ధ ప్రత్యేకించి విడుదల చేస్తున్న సరికొత్త హెడ్ ఫోన్ సెట్స్ మరింత ఉపయుక్తంగా నిలుస్తాయి.

BH940, BH420, BH410 వేరియంట్లలో ఈ ఆడియో హెడ్ సెట్లను డిజైన్ చేశారు... అత్యాధునిక డిజిటల్ ఎన్‌హ్యాన్సడ్ కార్డ్‌లెస్ టెలీ కమ్యూనికేషన్ టెక్నాలజీని ‘BH410’ వర్షన్ హెడ్ సెట్‌లో పొందుపరిచారు. ఈ సౌలభ్యతతో దూరాన ఉన్న టెలిఫోన్ కాల్స్‌ను కూర్చొన్న చోట నుంచే రసీవ్ చేసుకోవచ్చు. మరో వర్షన్ హెడ్‌సెట్స్ ‘BH940’ వైర్ లెస్ వ్యవస్ధ ఆధారితంగా పనిచేస్తుంది. అతి తక్కువ బరువుతో డిజైన్ కాబడ్డ ఈ గ్యాడ్జెట్ హ్యాండ్ ఫ్రీ కాలింగ్ కు ఉపకరిస్తుంది. అత్యాధునిక సౌండ్ వ్యవస్థను ఈ పరికరంలో నిక్షిప్తం చేశారు. అంతరాయంలేని ఆడియోను శ్రోత అంతిమంగా పొందవచ్చు.

‘BH420’ వర్షన్ లో రూపుదిద్దుకున్న మరో హెడ్ సెట్ కంఫర్టబుల్ గా ఉంటుంది. మైక్రోఫోన్ అదేవిధంగా అత్యుత్తమమైన వైడ్ బ్యాండ్ ఆడియో క్వాలిటీని ఈ పరికరంలో పొందుపరిచారు. రూపొందించిన ఇయర్ ప్యాడ్స్ చెవులకు సౌకర్యవంతంగా ఇముడుతాయి. విడుదలకాబోతున్న ఈ మూడు గ్యాడ్జెట్లు మన్నికగా పనిచేసేందకు ‘లాగిటెక్’ సంస్థ పటిష్ట చర్యలు తీసుకుంది. ధర అంశానికి వస్తే ‘BH940’ వైర్ లెస్ మోనో హెడ్ సెట్ ధర రూ.10,000 కాగా మిగిలిన వాటి ధర ఇతర స్సెసిఫికేషన్ల వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot