‘లోవే’ 3డీ హోమ్ స్పీకర్ సిస్టమ్..!!

Posted By: Super

‘లోవే’ 3డీ హోమ్ స్పీకర్ సిస్టమ్..!!

మీ కళ్ల ముందే పెద్ద ‘డైనోసర్’ ఎగిరి గంతులేస్తుంది., క్రూరంగా మీ వైపు చూస్తుంది., దాని అరుపులకు మీ హార్ట్ బీట్ పెరిగింది., చెవులకు డీటీఎస్ మాదిరి చిల్లులు పడిపోతున్నాయి., తీరా కట్ చేసి చూస్తే 3డీ సినిమా అదిరింది. ఒళ్లు గగుర్పాటుకులోను ఇటువంటి అనుభూతులను ఇంట్లోనే ఆస్వాదించాలనుకుంటున్నారా...? అయితే ‘లోవే 3డీ హోమ్ స్పీకర్’ వ్యవస్థను కోనుగోలు చేయండి.

ఆడియో పరికరాల మరియు మ్యూజిక్ గ్యాడ్జెట్ల తయారీలో గత కొన్నాళ్లుగా క్రీయాశీలిక పాత్ర పోషిస్తున్న లోవే (Lowe) తన పరిధిని మరింత విస్తరించింది. తాజాగా ‘3డీ బ్లూ-రే ఆధారిత హోమ్ సినిమా సెట్ స్పీకర్ సిస్టమ్ ను’ మార్కెట్లో ప్రవేశపెట్టింది.

ఐపోడ్, ఐఫోన్ పరికరాలతో పాటు ఇతర సడీ, డీవీడీలను ఈ వ్యవస్థ ద్వారా ప్లే చేసుకోవచ్చ. గ్యాడ్జెట్లో అమర్చిన బ్లూరే త్రీడి ఫీచర్లు వినియోగదారులను రియాల్టీ అనుభూతులకు లోను చేస్తాయి. ప్లే అవుతున్న మ్యూజిక్ ను గుర్తించే ‘గ్రేస్ నోట్’,పాట టైటిల్, ఆర్టిస్ట్ తదితర వివరాలను సూచించే డిస్ ప్లేయింగ్ వ్యవస్థలను గ్యాడ్జెట్లో ముందుగానే లోడ్ చేశారు.

‘మీడియా విజన్ 3డీ వ్యవస్థ’ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఆల్యూమినియమ్ సిల్వర్ మరియు బ్లాక్ రంగుల్లో ఈ సిస్టమ్ లభ్యమవుతుంది. సబ్ ఊఫర్, శాటిలైట్ స్పీకర్స్ వంటి అదనపు ఫీచర్లు 3డీ సౌండ్ నాణ్యతను మరింతి పటిష్టితం చేస్తాయి. అతి త్వరలో విడుదల కాబోతున్న అత్యాధునిక సౌండ్ సిస్టమ్ ధర మరియు విడుదల తేదీకి సంబంధించి ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot