కొత్త ‘మ్యాజికో స్పీకర్ల’తో సౌండ్ కేకో కేక..!!

Posted By: Staff

కొత్త ‘మ్యాజికో స్పీకర్ల’తో సౌండ్ కేకో కేక..!!

సంగీత ప్రేమికులు గరిష్ట అనుభూతిని ఆస్వాదించేందుకు మన్నికైన స్పీకర్ వ్యవస్థ రూపుదిద్దుకుంది. అత్యాధునిక సౌండ్ టెక్నాలజితో రూపొందించబడ్డ స్పీకర్ సిస్టమ్ ధర వింటే గుండె జల్లుమంటుంది. అక్షరాల 9,80,000. ‘మ్యాజికో Q1’ పేరుతో విడుదలైన ఈ ఆధునిక సౌండ్ స్పీకర్ సిస్టమ్ ప్రస్తుత మార్కెట్లో హాట్ టాపిక్.

ప్రత్యేక ఫీచర్లను పరిశీలిస్తే పొందుపరిచిన ‘34Hz బాస్’ వ్యవస్థ సంగీతాన్ని నాణ్యమైన రేంజ్ లో అందిస్తుంది. ఆల్యూమినియమ్ పదార్థాన్ని స్పీకర్ వ్యవస్థ తయారీలో ఉపయోగించారు. సహజసిద్ధమైన అనుభూతికి లోనుచేసే ఆడ్వాన్సడ్ సౌండ్ టెక్నాలజీని ‘మ్యాజికో స్పీకర్ సిస్టమ్’లో ఏర్పాటు చేశారు. 14.1 అంగుళాల పొడవుతో, 62 పౌండ్ల బరువున్నఈ స్పీకర్ గ్యాడ్జెట్ ఆధ్యంతం ఉత్కంఠతకు లోను చేస్తుంది.

ప్రత్యేక సాంకేతికతతో రూపొందించిన 3డీ సౌండ్ ఫర్ ఫెక్షన్ వ్యవస్థను స్పీకర్లలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. ‘7 అంగుళాల ఊఫర్’ సౌండ్ వ్యవస్థ సిస్టమ్ కు మరో ప్రత్యేక ఆకర్షణ చేస్తుంది. మన్నికకు తగ్గా ధరను ఈ స్పీకర్ సిస్టమ్ కు నిర్థారించారు. క్వాలిటీని కోరుకునే వారికి ఈ సౌండ్ సిస్టమ్ ‘100 శాతం బెస్ట్’.

క్లుప్తంగా స్పెసిఫికేషన్లు:

Sensitivity: 86dB
Impedance: 5 Ohms
Frequency Response: 32 Hz - 50 KHz
Minimum Power: 50 Watts
Dimensions Including Stand: 44" H x 15.2" D x 10" W (112cm x 37cm x 25cm)
Weight:120 lbs. (54 kg)

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot