సంగీత ‘పాదరసం’లో మునిగితేలండి..!!

‘‘ఇక ఇల్లు పీకి పందరేయండి.., తిన్నది అరిగేంతవరకు చిందులేయండి.., దిగ్గజ స్పీకర్ల తయారీ సంస్థ ‘మెర్క్యురీ’ ఆధునిక పరిజ్ఞానంతో రూపొందించిన హోమ్ ధియోటర్ స్పీకర్లతో పాటు సబ్ ఊఫర్లను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. HT 7800, SW2600, SW2850U, SW5200U మోడళ్లతో విడుదల కాబోతున్న ఈ స్పీకర్లు కుర్రకారును సంగీత ప్రపంచంలో ముంచెత్తునున్నాయి. ఇక మీకు కంప్యూటర్లు, మ్యూజిక్ ప్లేయర్లతో పని లేదు కేవలం పాటలు లోడ్ చేసిన పెన్‌డ్రైవ్‌ను మెర్క్యరీ స్పీకర్ వ్యవస్థకు అనుసంధానిస్తే చాలు...’’
క్లుప్తంగా స్పీకర్ల ఫీచర్లు: సరికొత్త విధానంలో రూపొందించిన సబ్ ఊఫర్లలో యూఎస్బీ డ్రైవ్‌లతో పాటు ఎస్డీ కార్డులను అనుసంధానం చేసుకునేందుకు ఇన్‌బుల్ట్ స్లాట్లను ఏర్పాటు చేశారు. ఈ సౌలభ్యత ద్వారా పెన్‌డ్రైవ్ పరికారల్లో లేదా మెమరీ కార్డుల్లో నిక్షిప్తం చేసకున్నమ్యూజిక్‌ను నాణ్యమైన సంగీత వ్యవస్థ ద్వారా మీరు వినవచ్చు.
ఉడెన్ బాడీతో రూపుదిద్దుకున్న ఈ స్పీకర్లు రిథమ్‌తో కూడిన సంగీతాన్ని శ్రోతకు అందిస్తాయి. సబ్ ఊఫర్లలో అమర్చని 4 అంగుళాల అయిస్కాంత స్పీకర్లు, 2.5 అంగుళాల శాటిలైట్ స్పీకర్లు మ్యూజిక్‌లో అవాంతరాలు లేకుండా చూస్తాయి. ఈ హోమ్ ధియోటర్ వ్యవస్థ ద్వారా పాటలనే కాకుండా ఆటలతో పాటు సినిమాలను హై సౌండ్ ఎక్సీపిరీయన్స్‌తో విక్షించవచ్చు.
బ్లాక్ సిల్వర్ డిజైన్‌లో ఈ స్పీకర్ సెట్లు రూపుదిద్దుకున్నాయి. ఎఫ్ఎమ్ రేడియోను సైతం ఈ స్పీకర్ల ద్వారా వినవచ్చు. సబ్ ఊఫర్ల ధరలు రూ.12,99 నుంచి మొదలవుతున్నాయి.


Click it and Unblock the Notifications