సోని మైక్రో హై-ఫై సిస్టం!!

Posted By: Staff

సోని మైక్రో హై-ఫై సిస్టం!!

 

అంతర్జాతీయ సాంకేతిక పరికరాల తయారీదారు ‘సోని’ భారతీయ ఆడియో గ్యాడ్జెట్ల మార్కెట్లో ‘మైక్రో హై-ఫై సిస్టంను’ విడుదల చేసింది. WHG-SLK20D వర్షన్ లో విడుదలైన ఈ ఆడియో గ్యాడ్జెట్ ధర రూ.20,000.

ఈ గ్యాడ్జెట్ డిజైనింగ్ విషయానికొస్తే ముందుభాగంలో ఏర్పాటు చేసిన ఎల్ సీడీ ప్యానల్ (LCD panel) ప్లే అవుతున్న ట్రాక్ సంబంధిత సమాచారాన్ని డిస్ ప్లే చేస్తుంది. అదే విధంగా సిస్టంకు ఇరు వైపులా రెండు స్పీకర్లు అమర్చుకోవచ్చు. వాల్యుమ్ నియంత్రణ, ఫార్వార్డ్, బ్యాకవర్డ్, ఆన్-ఆఫ్ అంశాలకు సంబంధించి టచ్ బటన్ వ్యవస్ధను ఏర్పాటు చేశారు. సిస్టంలో నిక్షిప్తం చేసిన సీడీ-డీవీడీ ప్లేయర్ వ్యవస్థ ద్వారా సీడీ, డీవీడీలలో స్టోర్ చేసుకున్న పాటలను ప్లే చేసుకోవచ్చు. అదేవిధంగా ఏర్పాటు చేసిన ఎస్డీ కార్డ్ స్లాట్, యూఎస్బీ స్లాట్ అంశాలు ఇతర మ్యూజిక్ డివైజులను జత చేసుకునేందుకు దోహదపడతాయి. ఈ ఆడియో సిస్టంను హెచ్డీఎమ్ఐ టీవికి జత చేసుకోవచ్చు.

ముఖ్య ఫీచర్లు:

- WMA, MP3, AAC ఆడియో ఫార్మాట్లను ఈ సిస్టం సపోర్టచేస్తుంది,

- MPEG-4, DivX వీడియో ఫార్మాట్లను గ్యాడ్జెట్ సపోర్టు చేస్తుంది.

- ఇమేజ్ ప్లే బ్యాక్ సపోర్ట్ JPEG,

- బాస్ బూస్టర్, ఈక్యూ ప్రీసెట్స్, సరౌండ్ వ్యవస్థలు,

- 40 mm ట్వీటర్ యూనిట్, 130 mm వూఫర్, 90Wx2 ఆర్ ఎమ్ఎస్ పవర్ యూనిట్,

నిరుత్సాహపరిచే అంశాలు:

- లిమిటెడ్ వీడియో ప్లేబ్యాక్ ఆప్షన్స్,

- లిమిటెడ్ కనెక్టువిటీ,

- చిన్నదైన ఎల్ సీడీ స్క్రీన్,

- అధిక ధర.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting