మైక్రో ఎంపత్రీ ప్లేయర్, ‘ఎప్పుడైనా.. ఎక్కడైనా’!!

Posted By: Super

మైక్రో ఎంపత్రీ ప్లేయర్, ‘ఎప్పుడైనా.. ఎక్కడైనా’!!

 

ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో వినోదం (ఎంటర్‌టైన్‌మెంట్) ఓ భాగమైపోయింది. ఇంట్లో సేదతీరుతూ.. ఆఫీస్‌లో వర్క్ చేసుకుంటూ.. స్నేహితులతో ఎంజాయ్ చేస్తూ మ్యూజిక్‌ను భలే ఆస్వాదిస్తున్నాం. సాంకేతికత కొత్త పుంతుల తొక్కుతున్న నేపధ్యంలో రోజుకో కొత్త రకం మ్యూజిక్ గ్యాడ్జెట్ మార్కెట్లో విడుదలవుతుంది.

తాజాగా మార్కెట్లో విడుదల కాబోతున్న ‘CVSC-400’ మైక్రో ఎంపీత్రీ ప్లేయర్ ఫీచర్లను పరిశీలిద్దాం.. అత్యాధునిక సౌండ్ టెక్నాలజీతో డిజైన్ కాబడ్డ ఈ అల్ట్రాపోర్టబుల్ ‘ఎంపీత్రీ ప్లేయర్’ అతి తక్కువ బరువు కలిగి ఉండటంతో సులువుగా క్యారీ చేయ్యవచ్చు.

ప్లేయర్ స్టోరేజి సామర్ధ్యం ‘2జీబీ’, అదనంగా ఫ్లాష్ డ్రైవ్ సౌలభ్యతను కల్పించారు. యూఎస్బీ డ్రైవ్ ఫీచర్‌ను ప్లేయర్‌లో నిక్షిప్తం చేయ్యటంతో

కంప్యూటర్లకు జత చేసుకుని కావల్సిన ఫైల్స్‌ను ట్రాన్సఫర్ చేసుకోవచ్చు. అన్ని ఫార్మాట్లలో ఉన్న మ్యూజిక్ ఫైళ్లను ‘CVSC-400’ సపోర్టు చేస్తుంది.

3.5,2.5 హెడ్ ఫోన్ జాక్ లను ప్లేయర్లో ఏర్పాటు చేశారు. విండోస్, విస్టా, లైనక్స్, మ్యాక్ వంటి ఆపరేటింగ్ వ్యవస్థల పై ‘CVSC-400’మైక్రో ప్లేయర్ రన్ అవుతుంది.

ప్లేయర్లో ఏర్పాటు చేసిన లితియమ్ ఇయాన్ బ్యాటరీ వ్యవస్థ పటిష్ట బ్యాకప్ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. యూఎస్బీ పోర్టు ఆధారితంగా బ్యాటరీని ఛార్జ్ చేసుకోవచ్చు. వాల్యుమ్, ట్రాక్ ఫార్వడ్, ట్రాక్ సెలక్షన్ వంటి అంశాలకు సంబంధించి గ్యాడ్జెట్లో కంట్రోలింగ్ బటన్లను ఏర్పాటు చేశారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot