జ్యూన్ మీడియా ప్లేయర్ ఉత్పత్తులను నిలిపేసిన ‘మైక్రోసాఫ్ట్.’.?

Posted By: Staff

జ్యూన్ మీడియా ప్లేయర్ ఉత్పత్తులను నిలిపేసిన ‘మైక్రోసాఫ్ట్.’.?

‘‘ఇది ‘మైక్రో సాఫ్ట్’ అభిమానులకు నిరాశ కలిగించే అంశమే.., ‘ఆపిల్ ఐపోడ్’ను ఎదుర్కొనే క్రమంలో ‘మైక్రో సాఫ్ట్’ ప్రవేశపెట్టిన ‘జ్యూన్’ (Zune) మీడియా ప్లేయర్ల ఉత్పత్తులు నిలిచిపోనున్నాయి. అత్యాధునిక స్మార్ట్ ఫోన్ ఫీచర్లతో విడుదలైన ‘ఆపిల్ ఐపోన్’ను ఎదుర్కొవటంలో విఫలం చెందటం కారణంగానే మైక్రో సాఫ్ట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు విశ్లేషక వర్గాలు భావిస్తున్నాయి. వ్యాపార విస్తరణలో భాగాంగా ఈ ప్రకటన తీసుకున్నట్లు బ్రాండ్ వర్గాలు తమ అధికారిక వెబ్ సైట్లో ధృవీకరించాయి.’’

‘‘మార్కెట్‌ను అభివృద్ధి చేసే క్రమంలో మేమీ నిర్ణయం తీసుకుంటున్నాం, వినియోగదారులు ఏ మాత్రం నిరాశపడనవసరం లేదు, ఇక పై ‘జ్యూన్ మీడియా ప్లేయర్’ వ్యవస్థ, రాబోతున్న విండోస్ స్మార్ట్ ఫోన్లలో నిక్షిప్తమైఉంటుంది. మునుపటి కస్టమర్లు వారంటీ విషయంలో ఎటువంటి ఆందోళణకు గురికానవసరం లేదు. కస్టమర్ సర్వీస్ పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటుంది. వినియోగదారుడి సంతృప్తే మాకు ముఖ్యం’’ అంటూ బ్రాండ్ వర్గాలు వెబ్ సైట్లో పేర్కొన్నాయి.’’

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting