వారికోసం మినీ స్పీకర్లు వచ్చాయోచ్..!!

Posted By: Super

వారికోసం మినీ స్పీకర్లు వచ్చాయోచ్..!!


‘‘కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ అభివృద్ధి చెందుతున్న నేపధ్యంలో అర చేతిలో ప్రపంచాన్ని వీక్షించగలుగుతున్నాం. కొత్త తరం సాంకేతికత ఆవిర్భావంతో మ్యూజిక్ పరికరాల్లో సైతం మార్పులు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మార్కెట్లో విడుదలైన ‘ఎక్స్ మినీ II’(X-Mini II)స్పీకర్లు తక్కువ పరిమాణం కలిగి, అద్భుతమైన సౌండ్ వ్యవస్థతో రూపుదిద్దుకున్నాయి. ’’

వినికిడి లోపం ఉన్నవారికి ‘ఎక్స్ మినీ II’స్పీకర్లు మరింత సురక్షితం. స్పీకర్ల్ల ద్వారా విడుదలయ్యే సౌండ్ లోవర్ ఫ్రీక్వెన్సీలో వినసొంపుగా ఉంటుంది. స్పీకర్లు రీఛార్జబుల్ బ్యాటరీ వ్యవస్ధ ఆధారితంగా పనిచేస్తాయి. స్మార్ట్ ఫోన్, ల్యాప్ టాప్, తదితర మ్యూజిక్ పరికరాలను యూఎస్బీ పోర్టు ద్వారా స్పీకర్లకు జతచేసుకోవచ్చు. ఏర్పాటు చేసిన 340mAh బ్యాటరీ వ్యవస్థ కేవలం 2 గంటల్లోనే పూర్తి స్ధాయి రిఛార్జ్ అవుతుంది. 12 గంటల బ్యాటరీ బ్యాకప్ సామర్ధ్యంతో నాన్ స్టాప్ సంగీతాన్ని శ్రోత ఆస్వాదించవచ్చు.
ఆన్ ఆఫ్ పవర్ బటన్ వ్యవస్థను స్పీకర్ ముందు భాగంలో్ ఏర్పాటు చేశారు.

బంతి ఆకృతిలో డిజైన్ చేయబడ్డ ఈ స్పీకర్లు నాణ్యమైన బాస్ అవుట్ పుట్ టెక్నాలజీని కలిగి ఉంటాయి. స్పీకర్ పై భాగంలో ఏర్పాటు చేసిన లిడ్ ను ఓపెన్ చేస్తే చాలు
సౌండ్ బీటింగ్ లో వేరియేషన్లను చూడొచ్చు. 3.5mm ఆడయో జాక్ వ్యవస్థ శ్రో్తకు మరింత లబ్ధి చేకూరుస్తుంది.

టెక్నికల్ అంశాలను పరిశీలిస్తే ఈ మినీ స్పీకర్లు 100Hz నుంచి 20 KHz ఫ్రీక్వెన్సీ సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయి. 2.5W సామర్ధ్యం గల లౌడ్ స్పీకర్ ను సౌండ్ వ్యవస్థలో ఏర్పాటు చేశారు. మార్కెట్లో ‘ఎక్స్ మినీ II’ స్పీకర్ల ధర రూ.1700.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot