హై డెఫినిషన్ మ్యూజిక్‌ను మజా చేయండి!!

Posted By: Staff

 హై డెఫినిషన్ మ్యూజిక్‌ను మజా చేయండి!!

ప్రముఖ ఆడియో పరికరాల ఉత్పాదక సంస్థ మాన్సటర్ ( Monster) ఆరు కొత్త రంగులతో కూడిన హెడ్‌సెట్‌లను ప్రవేశపెట్టింది. బీట్ సిరీస్ నుంచి వస్తున్న ఈ హై డెఫినిషన్ హెడ్‌సెట్‌లు శ్రోతను ప్రొఫెషనల్ మ్యూజిక్ అనుభూతికి లోను చేస్తాయి. చెవులకు సౌకర్యవంతంగా ఇమిడే విధంగా ఈ హెడ్‌సెట్ ఇయర్‌కప్‌లను డిజైన్ చేశారు. మ్యూజిక్ వింటున్న సందర్భంలో శ్రోత కంఫర్ట్‌గా ఫీలయ్యేందకు గాను చల్లదనాన్నిచ్చే సున్నితమైన పదార్ధాన్ని ఇయర్‌కప్స్ నిర్మాణంలో వినియోగించినట్లు తెలుస్తోంది.

మాన్సటర్ పవర్ ఐసోలేషన్ టెక్నాలజీని ఈ హెడ్‌సెట్‌లలో దోహదం చేశారు. ఈ వ్యవస్థ సౌలభ్యతతో లైవ్ స్టూడియో అనుభూతిని శ్రోత ఆస్వాదించగలుగుతాడు. త్వరలోనే మాన్సటర్ బీట్ హెడ్‌ఫోన్స్ ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతాయని కంపెని అధికారిక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. ఆన్‌లైన్ ద్వారా ఈ హెడ్‌సెట్‌లను బుక్ చేసుకునే సౌలభ్యతను కల్పించారు. ఆన్‌లైన్ రిటైలర్ దుకాణాల్లో రూ.4000 నుంచి వీటి ప్రారంభ ధరలు ఉన్నాయి.


Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot