సూపర్ మొబైలింగ్..స్మార్ట్ మ్యూజిక్!!

Posted By: Prashanth

సూపర్ మొబైలింగ్..స్మార్ట్ మ్యూజిక్!!

 

మ్యూజిక్ ప్రధాన ఆకర్షణగా మోటరోలా సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను డిజైన్ చేసింది. పేరు మోటోస్మార్ట్ మిక్స్ XT550. ఆండ్రాయిడ్ ఆధారితంగా ఈ డివైజ్ పనిచేస్తుంది. హ్యాండ్‌సెట్‌లో నిక్షిప్తం చేసిన ఉత్తమ క్వాలిటీ ఆడియో వ్యవస్థ వినసొంపైన సంగీతాన్ని విడుదల చేస్తుంది.

ఇతర ఫీచర్లు:

ఫోన్ బరువు 131 గ్రాములు, 4 అంగుళాల మల్టీటచ్ స్ర్కీన్ (రిసల్యూషన్ 320 x 480పిక్సల్స్), ఆండ్రాయిడ్ జింజర్ బ్రెడ్ ఆపరేటింగ్ సిస్టం, 800 మెగాహెడ్జ్ క్వాల్కమ్ సింగిల్‌కోర్ ప్రాసెసర్, 3మెగా పిక్సల్ రేర్ కెమెరా, వీజీఏ ఫ్రంట్ కెమెరా, 512ఎంబీ ఇంటర్నల్ మెమరీ, ఎక్స్ట‌టర్నల్ మెమెరీ 32జీబి, మైక్రోఎస్డీ కార్డ్‌స్లాట్, జీపీఆర్ఎస్ సపోర్ట్, ఎడ్జ్ కనెక్టువిటీ, వై-ఫై, బ్లూటూత్, యూఎస్బీ కనెక్టువిటీ, హెచ్‌టిఎమ్ఎల్ బ్రౌజర్, నెట్‌వర్క్ సపోర్ట్ (2జీ, 3జీ), హై క్వాలిటీ ఆడియో ప్లేయర్, హై క్వాలిటీ వీడియో ప్లేయర్, సైనా మైక్రో మ్యూజిక్ అప్లికేషన్, స్పీకర్స్, స్టాండర్డ్ లియాన్ 1735 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, టాక్ టైమ్ 10 గంటలు, మమ్యూజిక్ ప్లేటైమ్ 30 గంటలు. మ్యూజిక్ ప్రియులకు ఈ ఫోన్ ఉత్తమమైన ఎంపిక. సంగీతాన్ని మృదువైన బాణిలో చెవులకు అందించే సూపర్ క్వాలిటీ హెడ్‌ఫోన్‌లను హ్యాండ్‌సెట్‌తో పొందవచ్చు.

సోనీ సూపర్ క్వాలిటీ ఇయర్ ఫోన్స్:

ప్రముఖ మ్యూజిక్ పరికరాల తయారీ సంస్థ సోనీ తాజాగా సరికొత్త ఇయర్ ఫోన్ లను డిజైన్ చేసింది. XBA-4గా వస్తున్న ఈ ఇయర్ ఫోన్స్ అత్యాధునిక సౌండ్ టెక్నాలజీని ఒదిగి ఉన్నాయి. సౌండ్ క్వాలిటీని మరింత బ్యాలెన్స్ చేసే ‘ఆర్మెట్యూర్ డ్రైవర్ల’ను ఈ హెడ్ ఫోన్ లలో నిక్షిప్తం చేశారు.

సోనీ XBA-4 ఫీచర్లు మరియు స్పెసిఫికేషన్ లు:

* లోవర్ సౌండ్ లీకేజ్,

* చెవులకు సౌకర్యవంతంగా ఇమిడే సిలికాన్ ఇయర్ బడ్స్,

* ఇయర్ ఫోన్స్ సెన్సిటివిటీ 108dB/mW,

* శక్తివంతమైన సౌండ్,

* ఒకటిన్నర మీటర్ల కనెక్టింగ్ కేబుల్.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot