‘మోటరోలా’దీపావళి పుకార్లు నిజమేనా..?

Posted By: Staff

‘మోటరోలా’దీపావళి పుకార్లు నిజమేనా..?

‘‘రెండు దుశాబ్ధాల సుదీర్ఘ చరిత్ర.., పరిశ్రమలో అపార అనుభవం..,వినియోగదారుల్లో చెక్కు చెదరని విశ్వసనీయత.., అంతర్జాతీయ ప్రమాణాలతో ఓ వైపు మొబైల్ ఫోన్ల రంగంలో , మరో వైపు టాబ్లెట్ పీసీల సెక్టార్లో, తాజాగా మ్యూజిక్ పరికరాల పరిశ్రమలో దూసుకుపోతున్న ‘మోటోరోలా’ దీపావళి కానుకగా బ్లూటూత్ ఆధారిత హెడ్ సెట్లను మార్కెట్లో ప్రవేశపెట్టనుంది., వాటి వివరాలు క్లుప్తంగా..’’

కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీతో ‘మోటరోలా’రూపొందించిన ఎలైట్ సిల్వర్, ఎలైట్ ఫ్లిప్ హెడ్ సెట్లు ‘హై డెఫినిషన్ ఆడియో ప్లస్ వ్యవస్థను’కలిగి ఉన్నాయి. హెడ్ సెట్లో ఏర్పాటు చేసిన బ్లూటూత్ సిగ్నలింగ్ సామర్ధ్యం 300 అడుగులు విస్తరించి ఉంటుంది.

‘మై మోటో స్పీక్’ స్పీచ్ టెక్నాలజీ వవ్యస్థను ఈ రెండు వేరియంట్లలో ప్రవేశపెట్టారు. ఈ అప్లికేషన్ సౌలభ్యతతో టైప్ చేసే అవసరం లేకుండా సందేశాలను వాయిస్ కమాండింగ్ ద్వారా పంపుకోవచ్చు. ‘ఎలైట్ ఫ్లిప్’లో పొందుపరిచిన ‘ట్రూ కంఫర్ట్ టెక్నాలజీ’, ‘రాపిడ్ కనెక్టు టెక్నాలజీ’ వ్యవస్థలు వేగవంతంగా స్పందించటంతో పాటు ఛార్జింగ్ ‘పవర్’ను ఆదా చేస్తాయి.

హెడ్ సెట్లలోని బ్యాటరీ అంశాలను పరిశీలిస్తే ‘మోటరోలా ఎలైట్ ప్లిప్’ 6 గంటల టాక్ టైమ్, 12 రోజుల ‘స్టాండ్ బై’ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ‘మోటరోలా ఎలైట్ సిల్వర్’ 15 గంటల ‘టాక్ టైమ్’ కలిగి 12 రోజుల స్టాండ్ బై సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

వీటి ధర అంశాలను పరిశీలిస్తే ‘ఎలైట్ సిల్వర్’ ధర రూ.5,900, ఎలైట్ ఫ్లిప్ ధర రూ.4,000 ఉండవచ్చని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీపావళి కానుకుగా అక్టోబర్ 24వ తేదిన వీటిని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot