ఫ్యాషనబుల్ ఎంపీత్రీ ప్లేయర్!!

Posted By: Prashanth

ఫ్యాషనబుల్ ఎంపీత్రీ ప్లేయర్!!

 

బి లిమిటెడ్ ఎడిషన్ వేరబుల్ ఎంపీత్రీ ప్లేయర్ పేరుతో ఓ మ్యూజిక్ డివైజ్‌ను రూపొందించి డిజైన్ హౌస్ సంస్థ అద్భత ఆవిష్కరణకు ఆజ్యం పోసింది. చొక్కాకు అమర్చుకునే చిన్న మ్యూజిక్ గ్యాడ్జెట్ సాయంతో సంగీతాన్ని హెడ్‌సెట్ ద్వారా స్ట్రీమ్ చేసుకోవచ్చు. అత్యంత తక్కువ బరువును కలిగి ఉండే ఈ పోర్టబుల్ ఎంపీత్రీ ప్లేయర్ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సంగీత ప్రేమికులను పెద్ద ఎత్తున ఆకట్టుకోగలదని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆధునీకరణలో భాగంగా చోటు చేసుకుంటున్న మార్పులను పరిగణలోకి తీసుకుని ఈ కొత్త ఆలోచనకు కార్యరూపాన్ని అద్దినట్లు డిజైన్‌హౌస్ సంస్థ వెల్లడించింది. తాము రూపొందించిన ఈ గ్యాడ్జెట్ ఆధునిక పొకడకు ప్రత్యక్ష నిదర్శనంగా నిలుస్తుందని సంబంధిత వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.

ఈ బుల్లి ఎంపీత్రీ ప్లేయర్ ఫ్యాషన్ అదేవిధంగా ట్రెండీ అవుట్ లుక్‌లో కనిపించటానికి లూయిస్ విట్టన్స్ మెన్స్‌వేర్ డిజైనర్, కిమ్ జోన్స్ కీలక పాత్ర పోషించినట్లు సమాచారం. ‘సర్క్యులర్ షేప్’లో మౌల్డ్ చేయబడిన వేరబుల్ ఎంపీత్రీ ప్లేయర్‌ను షర్ట్ వెలుపుల భాగంలో అమర్చుకోవల్సి ఉంటుంది. ఈ ప్లేయర్‌తో పాటు హెడ్‌సెట్‌ను అదనంగా పొందవచ్చు. పాస్, ప్లే, స్కిప్ బటన్లను హెడ్‌ఫోన్‌లో ఏర్పాటు చేశారు. హెడ్‌ఫోన్‌లో ఏర్పాటు చేసిన సాఫ్ట్ ఇయర్ బడ్స్ చెవులకు సౌకర్యవంతంగా ఇముడుతాయి.

ముందుగానే ప్రొగ్రామ్ చేయబడిన పాటల్ లిస్ట్‌ను ఈ బుల్లి మ్యూజిక్ ప్లేయర్ల నిక్షిప్తం చేసుకోవల్సి ఉంటుంది. తెలుపు, నలుపు మరియు ఎరుపు రంగు కలర్ వేరియంట్‌లలో ఇవి లభ్యం కానున్నాయి. అయితే ఇప్పటి వరకు తయారు చేసిన మ్యూజిక్ ప్లేయర్ల సంఖ్య 30 పీస్‌లు మాత్రమే. మార్కెట్ స్పందనను బట్టి ఉత్పత్తి సంఖ్యను మరింత పెంచే అవకాశముందని తెలుస్తోంది. ధర ఇతర వివరాలు తెలియాల్సి ఉంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting