కంటి చూపుతో పనిలేదు..మ్యూజిక్ వింటే చాలు!

Posted By: Super

 కంటి చూపుతో పనిలేదు..మ్యూజిక్ వింటే చాలు!

అవును మీరు వింటున్నది నిజమే!.. కంటిచూపుతో పనిలేకుండా, కేవలం మ్యూజిక్ వింటూ ఇంటి బాధ్యతలను చక్కబెట్టుకోవచ్చు. కంటితో చూడకుండా రోజూ తాగే కాఫీ కప్పు ఎక్కడుందో కచ్చితంగా తెలుసుకోవచ్చు. ఎదుటి వాళ్లు అందించిన చేయిని కూడా ఇబ్బంది లేకుండా పట్టుకోవచ్చు. ఇందుకు సంగీతం వింటే సరిపోతుంది! అవును, జెరూసలేంలోని హీబ్రూ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ ప్రత్యేక పరికరాన్ని రూపొందించారు. ఇది అంధుల చుట్టూ ఉన్న వాతావరణాన్ని సంకేతాలుగా మార్చి సంగీతంగా వినిపిస్తుందట! చుట్టూ ఉన్న వస్తువులన్నింటినీ ఆ సంగీతం ద్వారానే తెలుసుకోవచ్చు.

వస్తువుల రంగులు, అవి ఉన్న దూరం, ఎత్తు, పరిమాణం సూచించేలా ప్రత్యేకమైన సంకేతాలు వేర్వేరు నిడివితో అంధులకు సంగీతంగా వినిపిస్తుందన్నమాట! సెన్సరీ సబ్‌స్టిట్యుషన్ డివైజ్(ఎస్ఎస్‌డీ)గా పిలుస్తున్న ఈ పరికరానికి 'ఐమ్యూజిక్' అని పేరు పెట్టారు. ఇప్పటివరకు జరిపిన ప్రయోగాలు విజయవంతంకావడంతో శాస్త్రవేత్తలు ఈ పరికరాన్ని మరింత శక్తిమంతంగా తయారుచేసే పనిలో పడ్డారు.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot