‘ఆండ్రాయిడ్, విండోస్’ వాడకందారుల ప్రత్యేకం.!!

Posted By: Super

‘ఆండ్రాయిడ్, విండోస్’ వాడకందారుల ప్రత్యేకం.!!

ఆండ్రాయిడ్ మరియు విండోస్ వాడకందారులకు ఈ కధనం ప్రత్యేకం. దిగ్గజ ఎలక్ట్ర్రానిక్ సంస్ధ ‘నాడ్’, ఆండ్రాయిడ్, విండోస్ ఆధారిత గ్యాడ్జెట్లకు బ్లూటూత్ వ్యవస్థ ఆధారితంగా జత చేసుకునే విధంగా స్పీకర్ డాక్ సిస్టంను రూపొందించింది.

‘NAD విసో 1’ పేరుతో విడుదలైన ఈ స్పీకర్ డాక్ ద్వారా వినసొంపైన సంగీతాన్ని ఇతర పనులు చక్కబెట్టుకుంటూ ఆస్వాదించవచ్చు. ఐపోడ్, ఐఫోన్ వినియోగదారులకు ఈ స్పీకర్ డాక్ సిస్టమ్ మరింత ఉపయుక్తంగా నిలుస్తుంది.

టెక్నికల్ స్పెసిఫికేషన్లను పరిశీలిస్తే అధునాతన సౌండ్ టెక్నాలజీని డాక్‌లో నిక్షిప్తం చేశారు. NDA’s డిజిటల్ టెక్నాలజీ నాణ్యమైన క్లారిటీ, బాస్ అంశాలతో కూడిన మన్నికైన ఆడియో అవుట్ పుట్‌ను విడదుల చేస్తుంది.

ఏర్పాటు చేసిన 30 pin కనెక్టర్ వ్యవస్థ ఐపోడ్ ఛార్జ్ చేసుకునేందుకు సహకరిస్తుంది. వీడియోలను మన్నికైన ‘సౌండ్’తో వినేందుకు టెలివిజన్‌కు జత చేసుకునే విధంగా డాక్ స్పీకర్‌ను డిజైన్ చేశారు.

ఏర్పాటు చేసిన యూఎస్బీ పోర్ట్సు ద్వారా ఇతర సాఫ్ట్‌వేర్లను అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. IR రిమోట్ కంట్రోల్ వ్యవస్థ ఆధారితంగా సిస్టమ్ ఫీచర్లను నియంత్రించుకోవచ్చు. స్పీకర్ డాక్ మన్నిక విషయంలో ఏమాత్రం వెనుకాడని ‘నాడ్’ యాజమాన్యం తమ సరికొత్త ‘VISO 1’కు మిశ్రమ స్పందన లభిస్తుందని ధీమా వ్యక్తం చేస్తుంది. భారతీయ మార్కెట్లో ఈ అత్యుత్తమ స్పీకర్ డాక్ ధర రూ.34, 000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot