ఎన్ని గంటలైనా వింటూనే ఉంటారు!!

Posted By: Super

ఎన్ని గంటలైనా వింటూనే ఉంటారు!!

 

ప్రముఖ ఆడియో పరికరాల తయారీ సంస్థ లాగీటెక్ సరికొత్త వైర్‌లెస్ హెడ్‌సెట్‌ను డిజైన్ చేసింది. ఈ యూజర్ ఫ్రెండ్లీ ఆడియో సిస్టం శ్రోతను సౌకర్యవంతమైన అనుభూతులకు లోను చేస్తుంది. అన్ని రకాలైన సంగీత ప్రేమికులను మైమపరించే విధంగా ఈ డివైజ్ రూపకల్పన జరిగింది. ముఖ్యంగా చెవులకు సౌకర్యవంతంగా ఇమిడే సైడ్ ప్యానల్స్, లైట్ వెయిట్, పోర్టుబుల్ వంటి అంశాలు మరింత ఆకట్టకుంటాయి.

హెడ్‌సెట్ ప్రధాన ఫీచర్లు:

. అత్యాధునిక బ్లూటూత్,

. 6 గంటల బ్యాకప్ నిచ్చే రీఛార్జబుల్ బ్యాటరీ,

. బ్లూటూత్ సాంధ్రత 33 అడుగులు,

. లేజర్ ట్యూనుడ్ డ్రైవర్స్.

ఈ గ్యాడ్జెట్ ఉత్పత్తి చేసే అద్వితీయమైన సౌండ్ శ్రోతకు కొత్త అనుభూతులను పంచుతుంది. కీ బటన్లను హెడ్‌సెట్ కుడి బాగంలో అమర్చారు. మైక్రో యూఎస్బీ కేబుల్ ఆధారితంగా హెడ్‌సెట్‌ను ఛార్జ్ చేసుకోవల్సి ఉంటుంది. బ్యాటరీ బ్యాకప్ ఆరు గంటలు. ముఖ్యంగా ప్రయాణ సందర్భాల్లో ఈ డివైజ్ ఒత్తడిలేని వినోదాన్ని చేరువచేస్తుంది. హెడ్‌సెట్‌లో పొందుపరిచిన అత్యాధునిక సౌండ్ టెక్నాలజీ క్లారిటీతో కూడిన ఆడియోను ఉత్పత్తి చేస్తుంది. గృహ అదేవిధంగా ఆఫీస్ అవసరాలకు ఈ హెడ్‌సెట్‌ను పూర్తి స్థాయిలో వినియోగించుకోవచ్చు.

ఈ హ్యాండ్‌సెట్‌ను పదిలపరుచుకునేందకు కావల్సిన క్యారీ కేస్‌ను విడిగా కోనుగోలు చేయ్యాల్సి ఉంటుంది. ఈ కేస్ ధర రూ.250 నుంచి 500 వరకు ఉంటుంది. ఈ గ్యాడ్జెట్‌ను ధరించి శ్రోత ఎంతసేపైనా సంగీతాన్ని ఆస్వాదించవచ్చు. ఐప్యాడ్, ఐఫోన్, ఐపోడ్ టచ్ పరికరాలను ఈ హెడ్‌సెట్‌ను సులువుగా పెయిర్ చేసుకోవచ్చు. ఇండియన్ మార్కెట్లో ధర అంచనా రూ.3,500.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot