‘సోని మ్యూజిక్ ప్లేయర్’ ఆధ్యంతం ఉత్కంఠభరితం..!!

Posted By: Staff

‘సోని మ్యూజిక్ ప్లేయర్’ ఆధ్యంతం ఉత్కంఠభరితం..!!


‘‘ఆపిల్ ఐపాడ్‌లకు చెక్ పట్టేందుకు ఆట మొదలైంది. సాంకేతకి మార్కెట్‌లో సంవత్సరాల కాలంగా ఆధిపత్యాన్ని కొనసాగుగిస్తున్నఆపిల్ ఐపాడ్‌కు సోని ఎసరు పెట్టనుంది, అత్యాధునిక సాంకేతికతో సోని విడుదల చేయుబోతున్న మ్యూజిక్ ప్లేయర్ (Z1000) ప్రస్తుత మార్కెట్లో హాట్ టాపిక్. భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్నసరికొత్త సోని Z1000 మ్యూజిక్ ప్లేయర్ వినియోగదారులకు మరింత చేరువవుతుందని విశ్లేషక వర్గాలు భావిస్తున్నాయి.’’

క్లుప్తంగా ఫీచర్లు:

- ఆండ్రాయిడ్ 2.3 జింజర్ బోర్డు ఆపరేటింగ్ వ్యవస్థ ఆధారితంగా ఈ మ్యూజిక్ ప్లేయర్ పనిచేస్తుంది.

- నాణ్యమైన 4.3 అంగుళాల డిస్ ప్లే 480 X 800 పిక్సల్ రిసల్యూషన్ కలిగి ఉంటుంది.

- న్విడియా టెగ్రా 2 మొబైల్ డ్యూయల్ కోర్ వ్యవస్థను గ్యాడ్జెట్లో పొందుపరిచారు.

- ఏర్పాటు చేసిన ఎస్ - మాస్టర్ (S- Master) మిక్స్ సౌండ్ ప్రొసెసింగ్ వ్యవస్థ వినసొంపైన మ్యూజిక్‌ను అందిస్తుంది.

- 16, 32, 64 జీబీ ఇంటెర్నల్ వేరియంట్లలో ఈ మ్యూజిక్ డివైజులు లభ్యమవుతున్నాయి.

- మ్యూజిక్ ప్లేయర్‌లోని W బటన్‌ను ప్రెస్ చేస్తే చాలు డైరెక్టుగా వాక్‌మెన్ ప్లేయర్‌లోకి వెళ్లిపోవచ్చు.

- మ్యూజిక్ ప్లేయర్ ద్వారా శ్రోత ఆన్‌లైన్ మ్యూజిక్ సైట్ల నుంచి సంగీతాన్ని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

- మ్యూజిక్ ఫ్లేయర్‌లో అనుసంధానించిన హై డెఫినిషన్ వ్యవస్ధ వీడియోలను నాణ్యమైన పరిమాణం అందిస్తుంది. వీడియో గేమ్‌లను ఆడవచ్చు.

- మ్యూజిక్ ప్లేయర్‌లో పొందుపరిచిన DLNA వైర్‌లెస్ కనెక్టువిటీ సాయంతో , వైర్‌లెస్ ఆప్షన్ ఉన్న టీవిలతో ఇతర స్పీకర్లకు అనుసంధానం చేసుకోవచ్చు. హెచ్‌డీ‌ఎమ్‌ఐ పోర్టును అదనంగా ఈ మ్యూజిక్ ప్లేయర్‌ లో ఏర్పాటు చేశారు.

- చివరిగా ధరల అంశానికి వస్తే 16జీబీ సామర్ధ్యం గల సోని Z1000 మ్యూజిక్ ప్లేయర్ ధర రూ. 17,500, 32 సామర్ధ్యంగల మ్యూజిక్ ప్లేయర్ ధర రూ.20,500, 64జీబీ సామర్ధ్యం గల మ్యాజిక్ ప్లేయర్ రూ.25,900కు లభించనున్నట్లు వ్యాపార వర్గాలు పేర్కొంటున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot