కుర్రకారంతా ఫ్లాట్!!

Posted By: Prashanth

కుర్రకారంతా ఫ్లాట్!!

 

ఎలక్ట్రానిక్స్ విభాగంలోకి అడుగుపెట్టిన ప్లాంట్రానిక్స్ తొలి అడుగులోనే యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. బ్యాక్ బీట్ వైరలెస్ హెడ్‌సెట్ పేరుతో ఉత్తమ క్వాలిటీ సౌండ్ గ్యాడ్జెట్‌‌ను రూపొందించిన ప్లాంట్రానిక్స్ ఆ విభాగంలో కొత్త ఒరవడికి నాంది పలుకింది.

బ్యాక్ బీట్ వైరలెస్ హెడ్‌సెట్ కీలక ఫీచర్లు:

13 గ్రాముల బరువు,

ఇన్‌లైన్ వాల్యుమ్ కంట్రోల్,

ఇంటిగ్రేటెడ్ మైక్,

బ్యాటరీ టాక్‌టైమ్ 4.5 గంటలు,

స్టాండ్ బై 10 గంటలు,

ఖచ్చితమైన ఆడియో స్ట్రీమింగ్ వ్యవస్ధ.

ఈ హెడ్‌సెట్‌లో పొందుపరిచిన డిజిటల్ నాయిస్ రిడక్షన్, ఇకో క్యాన్సిలింగ్ టెక్నాలజీ అదే విధంగా ఇంటిగ్రేటెడ్ మైక్ వ్యవస్థలు ఉత్తమ హ్యాండ్ ఫ్రీ కాలింగ్‌కు సహకరిస్తాయి. ఏర్పాటు చేసిన బ్లూటూత్ కనెక్టువిటీ వైర్ల సాయం లేకుండా హెడ్‌సెట్‌ను ఇతర పరికరాలకు కనెక్ట్ చేస్తుంది. డివైజ్‌ను ఒక్క సారి ఛార్జ్ చేస్తే చాలు 10 గంటల పాటు అంతరాయం లేకుండా ఉపయోగించుకోవచ్చు.

స్మార్ట్ ఫోన్స్, టాబ్లెట్ కంప్యూటర్స్ అదేవిధంగా ఎంపీత్రీ ప్లేయర్లకు హెడ్‌సెట్‌ను అనుసంధానించుకోవచ్చు. ఉత్తమ క్వాలిటీ స్టీరియో సౌండ్‌ను అంతిమంగా శ్రోత ఆస్వాదించవచ్చు. ఉత్తమ క్వాలిటీ మెటీరియల్‌తో రూపొందిచబడిన ఇయర్‌బడ్స్ చెవులకు సౌకర్యవంతంగా ఇముడుతాయి. హెడ్‌సెట్‌తో అదనంగా జత సాఫ్ట్ ఇయర్ బడ్‌లను పొందవచ్చు. మార్కెట్లో బ్యాక్‌బీట్ హెడ్‌ఫోన్‌ల ధర అంచనా రూ.6,000. స్టైల్, క్వాలిటీ, కంఫర్ట్ , పోర్టబులిటీ కోరుకునే వారికి ఈ కూల్ హెడ్‌ఫోన్ ఉత్తమమైన ఎంపిక.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot