నికాన్ ఇప్పుడు రూ. 1000కే.??

Posted By: Super

నికాన్ ఇప్పుడు రూ. 1000కే.??

ఆశ్చర్యంగా ఉందికదూ..?, అవును.. మీరు వింటున్నది నిజమే!!, నికాన్ గ్యాడ్జెట్ ఇప్పుడు వెయ్యి రూపాయిలకే.. నికాన్ కెమెరాలకు ప్రపంచ వ్యాప్తంగా ఎంత ఆదరణ ఉందో అందరికి తెలుసు. ఫోటోలో కనిపిస్తున్న ‘నికాన్ టెలిఫోటో 55-200mm లెన్స్’ కెమెరావి అనుకుంటే పప్పులో కాలేసినట్లే.

నాటి నుంచి నేటి వరకు కెమెరాల తయారీలో ప్రపంచం వ్యాప్తంగా మన్నికైన బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకన్న నికాన్ తాజాగా ‘లెన్స్ స్పీకర్’ఆడియో గ్యాడ్జెట్ ను విడుదల చేసింది.

కెమెరా లెన్స్ ఆకృతిలో డిజైన్ కాబడ్డ ఈ స్పీకర్ ను కంప్యూటర్లు, స్మార్ట్ ఫోన్లతో పాటు ఇతర మ్యూజిక్ డివైజులకు 3.5mm మినీ జాక్ ఆధారితంగా జత చేసుకోవల్సి ఉంటుంది. స్పీకర్ డ్రైవర్లతో పాటు ఆధునిక ఆడియో సాంకేతికతను పరికరంలో పొందుపరిచారు.

గ్యాడ్జెట్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ బటన్ లో స్కిప్పింగ్, స్టాపింగ్, పాసింగ్ వంటి ఆప్షన్లను అమర్చారు. ఏర్పాటు చేసిన పటిష్ట లితియమ్ బ్యాటరీ వ్యవస్థను 4 గంటల బ్యాకప్ సామర్ధ్యం కలిగి ఉంటుంది. ‘యూఎస్బీ పోర్టు’ ఆధారితంగా ఛార్జింగ్ ప్రక్రియ వీలవుతుంది. వినూత్న రీతిలో అత్యాధునిక సౌండ్ అనుభూతిని కలిగించే ఈ స్పీకర్లు రూ.1000 నుంచి రూ.2000 మధ్య eBayలో లభ్యమవుతున్నాయి.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot