ఆడియో టెక్నికా థండర్

Posted By: Prashanth

ఆడియో టెక్నికా థండర్

 

ప్రముఖ మ్యూజిక్ గ్యాడ్జెట్ల తయారీ బ్రాండ్ ఆడియో టెక్నికా థండర్ లాంటి వార్తతో ముందుకొచ్చింది. ఈ కంపెనీ తాజాగా రూపొందించిన నాయిస్ - క్యాన్సిలింగ్ హెడ్‌ఫోన్ ప్రస్తుత మార్కెట్లో వేడి పుట్టిస్తుంది. అత్యాధునిక సౌండ్ స్పెసిఫికేషన్‌లతో రూపుదిద్దుకున్న ఈ హెడ్‌ఫోన్ పేరు ‘ఏటీహెచ్-ఏఎన్ సీ9’.ఈ డివైజ్ డిజైనింగ్ అంశాలను పరిగణంలోకి తీసుకుంటే యువతను ప్రధాన లక్ష్యంగా చేసుకుని తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది.

ATH-ANC9 ప్రధాన ఫీచర్లు:

- ఇన్‌లైన్ మైక్రోఫోన్ కంట్రోల్,

- ఫ్రీక్వెన్సీ స్పందన 10Hz,

- 3.5ఎమ్ఎమ్ స్గీరియో,

- సింగిల్ సైడెడ్ కేబుల్,

- 40ఎమ్ఎమ్ డ్రైవర్,

- ఫోల్డబుల్ డిజైన్,

- కేబుల్ పరిమాణం 1.2మీటర్లు,

- ట్రై-లెవల్ క్యాన్సిలేషన్ మోడ్స్,

- విద్యుత్ ప్రవాహ వ్యతిరేకత (ఇంపీడెన్స్) 100 ohms,

- 100 డెసిబల్ సాంధ్రత,

- డిటాచబుల్ కేబుల్స్,

- ఏఏఏ బ్యాటరీ

హెడ్‌ఫోన్‌లో ఏర్పాటు చేసిన ఇన్‌లైన్ మైక్రోఫోన్ కంట్రోల్ వ్యవస్థ కాల్స్ రిసీవ్ చేసుకునే సందర్బంలో అదేవిధంగా మ్యూజిక్ కంట్రోల్ చేసే సమయంలో ఉపయోగపడుతుంది. నిక్షిప్తం చేసిన నాయిస్ క్యాన్సిలేషన్ టెక్నాలజీ 95శాతం వరకు అనవసర శబ్ధాలను నిరోధిస్తుంది. ఈ సౌలభ్యతతో యూజర్ క్రిస్టల్ క్లారిటీతో కూడిన హై క్వాలిటీ సౌండ్‌ను ఆస్వాదించవచ్చు. ఇయర్‌బుడ్స్ సౌకర్యవంతంగా చెవులకు ఇముడుతాయి. స్టాండర్డ్ బ్లాక్ కలర్ వేరియంట్‌లో డిజైన్‌కాబడిన ఈ హెడ్‌ఫోన్ ధర అంచనా రూ.20,000.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot