నోకియా తాజా పరిస్థతి ఏంటి..?

Posted By: Super

నోకియా తాజా పరిస్థతి ఏంటి..?


‘‘రెండు నెలలుగా ఉత్కంఠ.., కొనసాగుతున్న నిరీక్షణ.., తాజాగా బయటకొచ్చిన చిన్న ‘క్లూ’,‘నోకియా’ తాజా ఆవిష్కరణ బ్లూటూత్ హెడ్ స్పీకర్లకు సంబంధించి ఫీచర్లు ఇతర స్పెసిఫికేషన్ల వివరాలు విశ్వసనీయంగా తెలియవచ్చాయి.’’

అంతరాయంలేని ‘ఆడియో’ను సౌకర్యవంతంగా శ్రోతకు అందించే క్రమంలో నోకియా ‘Essence Bluetooth headset’ పరికరాన్ని మార్కెట్లో ప్రవేశపెట్టనుంది. ‘ఆక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ వ్యవస్థ’ఈ హెడ్ సెట్లో ప్రత్యేక ఫీచర్.

32 గ్రాముల బరువుతో డిజైన్ కాబడ్డ ఈ గ్యాడ్జెట్ బ్లూటూత్ ఆధారితంగా పనిచేస్తుంది. స్పీకర్లో ఏర్పాటు చేసిన బ్లూటూత్ 10మీటర్ల సాంధ్రతను కలిగి ఉంటుంది. అమర్చని లియాన్ పాలిమర్ బ్యాటరీ వ్యవస్థ 8 గంటల బ్యాకప్, 240 గంటల స్లాండ్ బై సామర్ధ్యం కలిగి ఉంటుంది. కేవలం 45 నిమిషాల్లోనే ఈ బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవుతుంది.

‘ఆన్-ఆఫ్’,‘వాల్యూమ్ కంట్రోల్’కు సంబంధించి మల్టీ ఫంక్షన్ బటన్లను హెడ్ సెట్లో ఏర్పాటు చేశారు. ఈ స్పీకర్లలో ఏర్పాటుచేసిన సౌండ్ టెక్నాలజీతో కాల్ మాట్లాడే సమయంలో, అదేవిధంగా సంగీతాన్నిఆస్వాదించే సమయంలో శ్రోత మరింత లబ్ధి పొందుతాడు. ధర మరియు ఇతర ఫీచర్లకు సంబంధించి నోకియా త్వరలో అధికారిక ప్రకటనను వెలువరించనుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot