నోకియా సరికొత్త బ్లూటూత్ హెడ్‌సెట్, ఇప్పుడు కొత్త వ్యవస్ధతో..

Posted By: Super

నోకియా సరికొత్త బ్లూటూత్  హెడ్‌సెట్, ఇప్పుడు కొత్త వ్యవస్ధతో..

వినియోగదారుల విశ్వసనీయ బ్రాండ్ ‘నోకియా’ ప్రతిష్టాత్మక రెడ్ డాట్ డిజైన్ అవార్డుకు ఎంపికైంది. సురక్షిత, సౌలభ్యత, స్టైల్ మరియు అత్యాధునిక ఫీచర్లను రంగరించి మిస్టర్ నోకియా డిజైన్ చేసిన ‘BH-806’ బ్లూటూత్ హెడ్‌సెట్ గ్యాడ్జెట్‌ను ఉత్తమ పురస్కారం వరించింది.

నోకియా ‘J’గా వినియోగదారుల ముందుకు రాబోతున్న బ్లూటూత్ హెడ్ సెట్ ‘J’ ఆకృతిలో డిజైన్ కాబడింది. మన్నికైన ‘స్టెయిన్ లెస్ స్టీల్’లోహాన్ని ఈ గ్యాడ్జెట్ నిర్మాణంలో ఉపయోగించారు. కేవలం 8 గ్రాముల బరువుతో రూపుదిద్దుకున్న ఈ గ్యాడ్జెట్ మొబైల్ వాడకందారులకు కాల్స్ రిసీవ్ మరియు డయిల్ చేసే సందర్భంలో మరింత సౌకర్యవంతంగా ఉపయోగపడుతుంది.

బ్లూటూత్ ఆధారితంగా పనిచేసే ఈ హెడ్‌సెట్లలో ఇండికేటర్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. మొబైల్ ఫోన్‌కు , హెడ్‌సెట్‌ను పెయిర్ చేయగానే ఇండికేటర్ వ్యవస్థ స్పష్టమైన సంకేతాన్ని అందిస్తుంది. గ్యాడ్జెట్లో ఏర్పాటు చేసిన ‘మల్టీ ఫంక్షన్ కీ’ కాల్స్ కనెక్ట్ చేయ్యటంలో, హెడ్‌సెట్‌ను ఆన్ లేదా ఆఫ్ చేయ్యటానికి దోహదపడుతుంది.

మొబైల్‌తో ఈ ‘హెడ్‌సెట్’ను పెయిర్ చేసేందుకు 3 నిమిషాల టైమ్ తీసుకుంటుంది. అనంతరం వాయిస్ ప్రాంప్టింగ్ వ్యవస్థ ద్వారా భాషను ఎంపిక చేసుకోవల్సి ఉంటుంది.
గ్యాడ్జెట్ వాల్యూమ్ ఆటోమెటిక్‌గా ఎడ్జస్ట్ అవుతుంది.

హెడ్‌సెట్లో ఏర్పాటు చేసిన అత్యాధునిక సౌండ్ వ్యవస్థ అంతరాయంలేని ఆడియోను శ్రోతకు అందిస్తుంది. మైక్రో యూఎస్బీ కనెక్టర్ ఆధారితంగా గ్యాడ్జెట్‌ను ఛార్జ్ చేసుకోవల్సి ఉంటుంది. త్వరలో విడుదల కాబోతున్న నోకియా J బ్లూటూత్ హెడ్‌సెట్ ధర రూ. 7,100.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot