నోకియా ‘హెడ్ సెట్’.. సౌకర్యవంతమైన మాటల కోసం!!

Posted By: Super

నోకియా ‘హెడ్ సెట్’.. సౌకర్యవంతమైన మాటల కోసం!!

మన్నికైన స్మార్ట్ ఫోన్, టాబ్లెట్ పరికరాలను వినియోగదారులకు చేరువచేస్తూ, ప్రపంచ వ్యాప్తంగా విశ్వసనీయ బ్రాండ్ గా ముద్రపడిన ‘నోకియా’ కొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టింది. మెబైల్ ఫోన్ల విక్రయాల్లో అత్యధిక వాటాను కైవసం చేసుకున్న ‘నోకియా’మ్యూజిక్ పరికరాల తయారీ సెగ్మంట్లోకి ప్రవేశించింది. అత్యాధునిక సాంకేతిక వ్యవస్థతో రూపొందించిన బ్లూటూత్ ఆధారిత్ ‘హెడ్ సెట్’ను మార్కెట్లో ప్రవేశపెట్టింది.

‘నోకాయా లూనా ఎన్ఎఫ్సీ’గా విడుదలవుతన్న ఈ గ్యాడ్జెట్ క్లాసిక్ బ్లాక్, క్లాసిక్ వైట్, పింక్, బ్లూ తదితర ఆకర్షణీయ రంగుల్లో లభ్యమవుతుంది. క్లుప్తంగా ఫీచర్లు:

- హెడ్ సెట్ల బరువు కేవలం ‘5’ గ్రాములు మాత్రమే.
- హెడ్ సెట్ బ్లూటూత్ వర్షన్ 2.1, ప్రొఫైల్ 1.1, హ్యాండ్స్ ఫ్రీ ప్రొఫైల్ 1.5గా డిజైన్ చేయబడింది.
- ఎన్ఎఫ్సీ వ్యవస్థను హెడ్ సెట్లో పొందుపరిచారు.
- ఏర్పాటు చేసిన వాయిస్ ప్రాంఫ్ట్ టెక్నాలజీ, హెడ్ సెట్ బ్యాటరీ అయిపొతున్న సందర్భంలో వినియోగదారుడికి సంకేతాలు అందిస్తుంది.
- పటిష్ట లితియమ్ బ్యాటరీ వ్యవ్యస్థ 8 గంటల బ్యాకప్ సామర్థ్యాన్ని కలిగి ఉంటుది.
-వారంటీతో అందిస్తున్న ఈ గ్యాడ్జెట్ ధర రూ.5,600.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot