వినేందుకు మీరు సిద్ధమేనా..?

Posted By: Staff

 

[caption id="attachment_1386" align="aligncenter" width="500" caption="Onkyo CS-345 CD Mini System"]

వినేందుకు మీరు సిద్ధమేనా..?
[/caption]

ప్రముఖ మ్యూజిక్ పరికరాల తయారీదారు ‘ఆన్కాయో’(Onkyo) సరికొత్త ఆవిష్కరణకు శ్రీకారం చుట్టుంది. ప్రత్యేకించి ఐఫోడ్, ఐఫోన్ల కోసం  CS-345 CD మినీ ఆడియో సిస్టంను మార్కెట్లో విడుదల చేసింది.

ఈ ఆడియో గ్యాడ్జెట్ ప్రత్యేక ఫీచర్లను పరిశీలిస్తే  ‘అవుట్ పుట్ స్టీరియో’, ‘డిజిటల్ యాంఫ్లీఫైర్ సర్క్యుటరీ’ అత్యుత్తమ పనితీరును కలిగి ఉంటాయి. ఏర్పాటు చేసిన  సూపర్ బాస్ కంట్రోల్, యాక్టివ్ బాస్ కంట్రోల్ వ్యవస్థను మన్నికైన ఆడియోను విడుదల చేస్తాయి. స్పీకర్ సెక్షన్ విషయానికి వస్తే   2-ways బాస్ రిఫ్లెక్స్ టైప్ స్పీకర్లను మినీసిస్టంకు అనుసంధానం చేశారు.

సీడీ ప్లేయర్ ఆఫ్షన్ ఈ ఆడియో సిస్టంలో  మరో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. సీడీలోని  పాటలను ఈ మినీ సిస్టమ్ ద్వారా ఆస్వాదించవచ్చు. ఈ గ్యాడ్జెట్ ఫ్రీక్వెన్సీ సామర్ధ్యం 55 Hz – 50 KHz వరకు. డాక్ వ్యవస్థ ఆధారితంగా ఐపోడ్ లేదా ఐప్యాడ్ పరికరాన్ని మినీ సిస్టంకు జత చేసుకోవచ్చు. సిస్టంలో ముందుగానే లోడ్ చేసిన ఎఫ్ఎమ్ రేడియో 30 ఛానళ్ల సామర్ధ్యం కలిగి ఉంటుంది. ధరకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot