‘ఆనకాయో’ మ్యూజిక్ పరికరాల జోరు...!!

Posted By: Super

‘ఆనకాయో’ మ్యూజిక్ పరికరాల జోరు...!!

జపాన్ ప్రముఖ ఎలక్ట్రానిక్ వస్తువుల తయారీదారు ‘ఆనకాయో కార్పొరేషన్’ ఆడియో పరికరాలను తయారు చేయటంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఇప్పటికే పలు ప్రతిష్టాత్మక ‘గ్యాడ్జెట్ అవార్డుల’ను సొంతం చేసుకున్న ఈ బ్రాండ్ దిగ్గజ ఆపిల్ సంస్థ ద్వారా గుర్తింపు పొందిన ‘సరికొత్త టెబుల్ టాప్’ ఆడియో పరికరాలతో పాటు హై - ఫై కాంపోనెంట్లను మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది.

విడుదల కాబోతున్న టేబుల్ టాప్ మోడళ్లకు ‘ఐ ఓన్లీ ప్లే ABX-100’, ‘ఐ ఓన్లీ బాస్ SBX-300’, ‘ఐ ఓన్లీ స్ట్రీమ్’గా నామకరణం చేశారు. వీటి ఫీచర్లను పరిశీలిస్తే ఐ ఓన్లీ ప్లే ABX-100 డాకింగ్ స్పీకర్‌ను ఐపాడ్‌తో పాటు ఐఫోన్‌కు అనుసంధానం చేసుకోవచ్చు. ఐ‌ఓన్లీ బాస్ SBX-300 స్పీకర్ వ్యవస్థను ఐప్యాడ్‌కు అనుసంధానం చేసుకునే విధంగా రూపకల్పన చేశారు.

ఈ పరికరాల్లో ఏర్పాటు చేసిన ఎల్‌సీడీ టచ్‌స్క్రీన్ డిస్‌‌ప్లే కంట్రోల్ బటన్స్ ఆధారితంగా పనిచేస్తుంది. వైరలెస్ రిమోట్ల ద్వారా సౌండ్ వ్యవస్థను ఆపరేట్ చేయవచ్చు. ఈ స్పీకర్లలో పొందుపరిచిన అంశాలు సంగీతాన్ని నాణ్యమైన పిచ్‌లో శ్రోతకు అందిస్తాయి.

మరోవైపు ‘ఆనకాయో ఈ నవంబర్ లో 3 హై కాంపోనెంట్ సౌండ్ పరికారాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. A-9070 పేరుతో 4 రకాల స్టీరియో ఆంప్లీఫయర్లను సంస్థ తీర్చిదిద్దింది. C-7070 పేరుతో యూఎస్బీ, ఐపాడ్, ఐ ఫోన్ ఇన్‌పుట్‌లకు సహకరించే విధంగా సీడీ ప్లేయర్‌ను సంస్థ విడుదల చేయునుంది.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot