‘365’ రోజులు ఆన్‌లైన్ ఫ్రీ మ్యూజిక్!!

Posted By: Super

‘365’ రోజులు ఆన్‌లైన్ ఫ్రీ మ్యూజిక్!!

ఐఫోన్..ఐప్యాడ్..ఎంపీత్రీ.. ఎఫ్ఎం ఇలా రకరకాల మ్యూజిక్ ప్లేయర్ల ద్వారా సుమధుర సంగీతాన్ని ఆస్వాదిస్తున్నాం. అయితే ప్రపంచ వ్యాప్తంగా ప్రసారమవుతున్న రకరకాల సంగీతాన్ని ఇంట్లోనే కూర్చుని ‘365’ రోజులు ఆస్వాదించాలంటే...

అంతర్జాతీయంగా రిలే అవుతున్న రకరకాల గీతాలను వీనుల విందుగా వినిపించే ఆన్‌లైన్ సర్వీసులు కోకొల్లలుగా వ్యాప్తి చెందాయి. ‘పాప్’ మ్యూజిక్ మొదలుకుని షేకాడించే రాక్ మ్యూజిక్, తన్మయత్వానికిలోను చేసే భారతీయ సాంప్రదాయ సంగీతం వరకు ‘24X7’ ఆస్వాదించవచ్చు. నచ్చిన వాటిని పీసీలో నిక్షిప్తం చేసుకోవచ్చు.

ప్రపంచ వ్యాప్తంగా సంగీతాన్నందిస్తున్న ‘ఆన్‌లైన్’ సర్వీసుల సంఖ్య ఎంతో తెలుసా..? అక్షరాలా రెండు లక్షల పై మాటే! మన దేశానికి చెందిన మ్యూజిక్ ఛానళ్లను వినాలంటే ‘www.live365.com/genres/indian’లోకి లాగిన్ అవ్వాల్సిందే.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot