‘ఆర్బిట్ సౌండ్ T12v3 స్టీరియో సిస్టమ్’.., మ్యూజిక్ వింటూనే ఉండడి!!

Posted By: Super

‘ఆర్బిట్ సౌండ్ T12v3 స్టీరియో సిస్టమ్’.., మ్యూజిక్ వింటూనే ఉండడి!!


‘ఆర్బిట్’ ఈ పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది చివ్వింగ్ గమ్, తాజాగా మీ బ్రెయిన్‌ను ట్యూన్ చేసేందుకు ఆర్బిట్ (Orbit) సౌండ్ సిస్టమ్ మార్కెట్లో విడుదలయ్యింది. అత్యధిక సంగీత ప్రేమికులచే గుర్తింపు పొందిన ‘ఆర్బిట్ సౌండ్ సిస్టమ్’ కొత్త అనుభూతుల కలయక.

ఖచ్చితమైన క్రిస్టల్ క్లియర్ సౌండ్‌ను ‘ఆర్బిట్ సౌండ్ T12v3 స్టీరియో సిస్టమ్’ విడుదల చేస్తుంది. కొంత మేరకు స్థలాన్ని ఆక్రమించుకునే ఈ గ్యాడ్జెట్ 100mm పొడవు, 605 mm వెడల్పు వైశాల్యం కలిగి ఉంటుంది. 8 కేజీల బరువుండే ఈ స్టీరియ్ సిస్టమ్ ఒకచోటు నుంచి మరోచోటుకు మార్చుకోవాలంటే కొద్దిగా కష్టంగానే ఉంటుంది.

‘ఐపాడ్’ను ఈ స్టీరియో సిస్టమ్‌కు జత చేసుకోవచ్చు. మెటల్ గ్రిల్‌తో డిజైన్ చేయబడిన సిస్టమ్ స్పీకర్లు కిందపడినా ప్రమాదం లేకుండా రక్షిస్తాయి. అత్యాధునిక సౌండ్ టెక్నాలజీతో రూపొందించిన సబ్ ఊఫర్ వ్యవస్ధ మన్నికైన భీటింగ్ అనుభూతిని కలిగిస్తుంది. రిమోట్ కంట్రోల్ సహకారంతో ఈ స్పీకర్ సిస్టమ్‌ను ఆపరేట్ చేసుకోవచ్చు.

మూడో ‘జనరేషన్ డివైజ్’గా అభివర్ణించబడుతున్న ‘ఆర్బిట్ సౌండ్ స్టిరీయో సిస్టమ్’ శక్తివంతమైన 5.1 సరౌండ్ సౌండ్ వ్యవస్థను కలిగి ఉంటుంది. సిస్టమ్‌లో ఏర్పాటు చసిన ‘100 వాట్’ ఆంప్లీఫయర్ వ్యవస్ధ, హై డెఫినిషన్ సౌండ్ నాణ్యతతో మ్యూజిక్‌ను విడుదల చేస్తుంది. కోయాక్సియల్ ( coaxial digital) వ్యవస్థను సపోర్టు చేసే ఫీచర్లను ఈ సిస్టమ్‌లో ఏర్పాటు చేశారు.

3.5mm జాక్ స్టీరియో సిస్టమ్‌కు ఆకర్షణగా నిలుస్తుంది. వైర్‌లెస్ ఆప్షన్లతో పనిచేసే ఈ సౌండ్ సిస్టమ్‌ను టీవికి జత చేసుకోవచ్చు. పార్టీ ఇతర శుభకార్యాలను ‘ఆర్బిట్ సౌండ్ T12v3 స్టీరియో సిస్టమ్’తో సందడి సందడిగా నిర్వహించుకోవచ్చు. ఇండియన్ మార్కెట్లో ఈ సౌండ్ గ్యాడ్జెట్ ధర రూ.19,500.

Opinion Poll

Social Counting

ఇన్స్టెంట్ న్యూస్ అప్డేట్స్ రోజుంతా పొందండి - Telugu Gizbot