‘ప్యానాసానిక్’ డీటీఎస్ హోమ్ ధియోటర్!!!

Posted By: Staff

‘ప్యానాసానిక్’ డీటీఎస్ హోమ్ ధియోటర్!!!


వినియోగదారులకు మన్నికైన ఎలక్ట్రానిక్ వస్తువులను సమకూర్చటంలో సఫలీకృతమైన ‘ప్యానాసానిక్’ (Panasonic) మరో మారు సాంకేతిక ప్రియులకు చేరువయ్యే ప్రయత్నం చేసింది. తన ప్రధాన పోటీదారైన ‘సోని కార్పొరేషన్’ను ఎదుర్కొనేందుకు రంగం సిద్ధం చేసింది.

తాజాగా ప్యానాసానిక్ అత్యాధునిక సౌండ్ పరిజానంతో రూపొందించిన ‘SC-HTB520’ హోమ్ ధియోటర్ సిస్టమ్‌ను మార్కెట్లో విడుదల చేసింది. మన్నికైన ఫీచర్లతో విడుదలైన ఈ సౌండ్ సిస్టమ్ వినియోగదారులకు మరింత లబ్ధి చేకూర్చుతుంది.

ఆకర్షణీయమైన బ్లాక్ కోటెడ్ బాడీ డిజైన్‌తో ఈ సౌండ్ వ్యవస్థ దర్శనమిస్తుంది. ఏర్పాటు చేసిన వైర్‌లెస్ సబ్ ఊఫర్ హై క్వాలిటీ బాస్ (bass)ను విడుదల చేస్తుంది.

హోమ్ ధియోటర్ సిస్టమ్‌లో అదనంగా ఏర్పాటు చేసిన ఇన్‌‌బుల్ట్ సరౌండ్ టెక్నాలజీ వ్యవస్ధ డీటీఎస్ (DTS) అనుభూతిని శ్రోతకు కలిగిస్తుంది. మరో ప్రత్యేకమైన ‘3డీ బ్లూరే’ వ్యవస్థను సిస్టమ్‌లో ఏర్పాటు చేశారు. ఈ వ్యవస్థ ఆధారితంగా ‘3డీ’ అనుభూతులను వినియోగదారుడు పొందవచ్చు.

అయితే ‘ఎనలాగ్ ఇన్‌పుట్’ వ్యవస్థ హోమ్ ధియోటర్‌లో కొరవడింది. అదే విధంగా మ్యూజిక్ ఫైల్ సంబంధిత సమాచారాన్నితెలిపే డిస్‌ప్లే వ్యవస్థను సైతం ఏర్పాటు చేయలేదు. అయితే అత్యాధునిక డిజైన్, నాణ్యమైన సౌండ్ టెక్నాలజీ వ్యవస్థలు సంగీత ప్రేమికుల మనసులను ఆకట్టుకుంటాయి. ‘ప్యానాసానిక్ SC-HTB520’ ఇండియన్ మార్కెట్ ధర రూ. 24,000గా నిర్థారించారు.

Please Wait while comments are loading...
Opinion Poll

Social Counting